Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తన పిల్లలకి సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియా ద్వారా అందిస్తూ ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా అకీరాకి సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈనెల 8న అకీరానందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. మేజర్ కావవడంతో తన తండ్రిని, పెదనాన్నని ఆదర్శంగా తీసుకున్న అకీరా వెంటనే రక్త దానం చేసి అందరి మనస్సులను దోచుకున్నాడు. తన కుమారుడు అకీరా నందన్ రక్తదానం చేశాడంటూ ఫోటోను షేర్ చేశారు రేణూ దేశాయ్ . 18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం ఇదే అంటూ ప్రకటించారు రేణూ.
పద్దెనిమిదేళ్లు నిండిన తరువాత రక్త దానం చేయండి.. మనం ఇచ్చే రక్తం వల్లే ఎవరో ఒకరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుందంటూ.. రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. రక్తం అనేది చాలా గొప్పది.. ఒకరికి అవసరం ఉందంటే మనం ఇవ్వగలిగేది రక్తమేనంటూ రేణూ దేశాయ్ తెలిపారు. ఇక పవన్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి కోరిక త్వరలోనే తీరబోతుందని సమాచారం.
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ లలో ఒకటైన హరిహర వీరమల్లు చిత్రంలో ఆయన కొడుకు అకీరానందన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. దర్శకుడు క్రిష్ ఓ కీలక పాత్ర కోసం ఎవరైతే బాగుంటుందని భావించి, చివరకు అకీరా నందన్ చేస్తే బాగుంటుందని.. పవన్ కళ్యాణ్‌ను అడిగితే ఆయన కూడా ఓకే అన్నట్లు టాక్ చక్కర్లు కొడుతోంది. గత కొద్ది రోజులుగా అకీరా మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. సినిమా కోసమే అని కొందరు అంటున్నారు. అయితే కొన్ని నెలలు ముందు రేణూ దేశాయ్ మాత్రం అకీరా నందన్‌కు ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదంది. మరి ఈ వార్తలపై నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…