Shruti Haasan : అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో అందరి దృష్టిలో పడింది. ఇక అక్కడ నుండి తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఫస్ట్ చాయిస్‌గా మారింది శృతి హాసన్. ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తూనే బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న శృతి హాసన్ ప్రేమాయణంలోనూ తగ్గేదేలే అంటోంది. శాంతనుతో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మాములుగా ఉండడం లేదు. పబ్లిక్‌గానే హగ్గులు, ముద్దుల వరకు వెళ్లింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్ అప్పుడప్పుడు నెటిజన్స్‌తో పలు విషయాలపై చర్చిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని విచిత్ర ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఓ నెటిజెన్.. మీ శరీరంలో ఎన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నారని అడిగాడు. ఈ ప్రశ్నకు శృతి ఒకింత అసహనానికి గురైంది. నీ పని నువ్వు చూసుకో అంటూనే.. అడిగావు కాబట్టి చెబుతున్నాను. ముక్కుకి మాత్రమే సర్జరీ చేయించుకున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ ఆమెకు సంబంధించి వస్తున్న పలు పుకార్లకి ఫుల్‌స్టాప్ పడింది.
చిన్న వయసులోనే సింగర్‌గా శృతి హాసన్ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని ఆల్బమ్‌లు కూడా చేసింది. ఇలా సాగిపోతోన్న సమయంలోనే 2000లో వచ్చిన హే రామ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం లక్ అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన అనగనగా ఓ ధీరుడుతో శృతి హీరోయిన్‌గానూ ప్రయాణం మెదలెట్టింది. ఇప్పుడు బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీతో పాటు చిరంజీవి 154వ చిత్రంలోనూ కథానాయికగా శృతి హాసన్ నటిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…