గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Renu Desai : తండ్రి ప‌వన్ క‌ల్యాణ్ మెచ్చే ప‌ని చేసిన అకీరా నంద‌న్‌.. రేణు దేశాయ్ పోస్ట్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త‌న పిల్ల‌ల‌కి సంబంధించిన అప్‌డేట్స్ సోష‌ల్ మీడియా ద్వారా అందిస్తూ ఉంటుంద‌న్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. తాజాగా అకీరాకి సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈనెల…

Renu Desai : తండ్రి ప‌వన్ క‌ల్యాణ్ మెచ్చే ప‌ని చేసిన అకీరా నంద‌న్‌.. రేణు దేశాయ్ పోస్ట్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ త‌న పిల్ల‌ల‌కి సంబంధించిన అప్‌డేట్స్ సోష‌ల్ మీడియా ద్వారా అందిస్తూ ఉంటుంద‌న్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. తాజాగా అకీరాకి సంబంధించి ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈనెల 8న అకీరానందన్ 18వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. మేజర్ కావ‌వడంతో త‌న తండ్రిని, పెద‌నాన్న‌ని ఆదర్శంగా తీసుకున్న అకీరా వెంటనే రక్త దానం చేసి అందరి మనస్సుల‌ను దోచుకున్నాడు. తన కుమారుడు అకీరా నందన్ రక్తదానం చేశాడంటూ ఫోటోను షేర్ చేశారు రేణూ దేశాయ్ . 18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం ఇదే అంటూ ప్రకటించారు రేణూ.

Renu Desai latest post about her son Akira Nandan
Renu Desai

పద్దెనిమిదేళ్లు నిండిన తరువాత రక్త దానం చేయండి.. మనం ఇచ్చే రక్తం వల్లే ఎవరో ఒకరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుందంటూ.. రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. రక్తం అనేది చాలా గొప్పది.. ఒకరికి అవసరం ఉందంటే మనం ఇవ్వగలిగేది రక్తమేనంటూ రేణూ దేశాయ్ తెలిపారు. ఇక ప‌వ‌న్ కొడుకు అకీరా నందన్‌ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వ‌స్తాడా ? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి కోరిక త్వ‌ర‌లోనే తీర‌బోతుంద‌ని స‌మాచారం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీస్ ల‌లో ఒక‌టైన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో ఆయ‌న కొడుకు అకీరానందన్‌ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడు క్రిష్ ఓ కీల‌క పాత్ర కోసం ఎవ‌రైతే బాగుంటుంద‌ని భావించి, చివ‌ర‌కు అకీరా నందన్ చేస్తే బాగుంటుంద‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అడిగితే ఆయ‌న కూడా ఓకే అన్న‌ట్లు టాక్ చ‌క్క‌ర్లు కొడుతోంది. గ‌త కొద్ది రోజులుగా అకీరా మార్ష‌ల్ ఆర్ట్స్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నాడు. సినిమా కోసమే అని కొంద‌రు అంటున్నారు. అయితే కొన్ని నెల‌లు ముందు రేణూ దేశాయ్ మాత్రం అకీరా నంద‌న్‌కు ఇప్ప‌ట్లో సినిమాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే లేదంది. మ‌రి ఈ వార్త‌ల‌పై నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి