Renu Desai : ఆ స్టార్ హీరో మూవీతో రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్.. ఖుషి అవుతున్న పవన్ ఫ్యాన్స్..

September 19, 2022 7:37 PM

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన‌ రేణుదేశాయ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు (అకీరా నందన్, ఆద్య‌). పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయి ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

అయితే.. ఇంతకాలం సినిమాలకు దూరమైన‌ రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం అలాగే ఉంది. ఓ మంచి తల్లిగా, పిల్లలను తండ్రికి దగ్గరగా ఉంచుతూ వస్తున్న రేణుదేశాయ్ అంటే పవన్ ఫ్యాన్స్ కి ఎంతో అభిమానం. ఇక ఇన్నేళ్లపాటు నటనకు, సినిమాలకు దూరంగా ఉన్నా.. రేణుదేశాయ్ బుల్లితెర ప్రోగ్రాంస్, సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్ లో ఉంటోంది. అయితే.. సినిమాల్లోకి రేణుదేశాయ్ రీఎంట్రీ ఎప్పుడు? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

Renu Desai given clarity on her new film with ravi teja
Renu Desai

మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాలో హేమలత లవణం అనే కీలకపాత్రలో తాను నటిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది రేణుదేశాయ్. హేమలత అంటే టైగర్ నాగేశ్వరరావు అక్క. అంటే ఈ మూవీలో రవితేజకు అక్కగా రేణుదేశాయ్ కనిపించనుందన్నమాట. మొత్తానికి రేణుదేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేసింది. రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతగా సక్సెస్ అవుతారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment