Ravindra Jadeja : డిసెంబర్ 17న విడుదలైన పుష్ప చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ రికార్డులని చెరిపేస్తోంది. ఈ క్రమంలో పుష్ప చిత్ర బృందం పలు ప్రాంతాలలో సక్సెస్ మీట్‌లు నిర్వహిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పలు ప్రాంతాలలోనూ పుష్ప మానియా నడుస్తోంది. కాగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. అల్లు అర్జున్ ట్రాన్స్‌లో పడిపోయాడు.
పుష్ప సినిమాలో ‘తగ్గేదే లే’ అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌కు సామాన్యులతోపాటు సెలబ్స్ సైతం పలు వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెటర్స్ కూడా రీల్స్ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొన్నటికి మొన్న ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్‌ను ఫేస్ మార్ఫింగ్ చేసి తగ్గేదే లే అంటూ డైలాగ్ చెప్పడం వైరల్‌గా మారింది.
తాజాగా రవీంద్ర జడేజా కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ”పుష్ప.. పుష్పరాజ్.. దీనమ్మ తగ్గేదే లే..” అంటూ సూపర్ మాడ్యూలేషన్‌తో చెప్పాడు. జడేజా చెప్పిన డైలాగ్‌ను మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ రాగా, వేలల్లో కామెంట్లు వచ్చేశాయి. రవీంద్ర జడేజా తెలుగు సినిమా వీడియో చేయడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు టాలీవుడ్ అభిమానులు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…