Rashmika Mandanna : చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కన్నడ నటి రష్మిక మందన్నకు భారీ స్థాయిలో పేరు వచ్చింది. దీంతో ఈమె వరుస అవకాశాలను దక్కించుకుంటోంది. ఈమె నటించిన చిత్రాల్లో చాలా వరకు హిట్ అవుతున్నాయి. దీంతో ఆఫర్స్ కూడా ఈమెకు బాగానే వస్తున్నాయి. తాజాగా ఈమె నటించిన పుష్ప మూవీ విడుదల కాగా.. ఈ మూవీ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో రష్మిక నటన అద్భుతమనే చెప్పాలి.
అయితే తాజాగా రష్మిక మందన్నకు చెందిన పూజల ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆధ్వర్యంలో రష్మిక పలు పూజలు చేసినట్లు ఫొటోలను చూస్తే తెలుస్తుంది. అయితే ఈ పూజలను ఆమె ఎందుకు చేయించిందో అర్థం కావడం లేదు.
గతంలో సమంత, చైతన్యలు విడిపోతారని వేణు స్వామి చెప్పారు. అలాగే కొన్ని విషయాల్లోనూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. ఈ క్రమంలోనే తన జాతకంలోనూ దోషం ఉందని భావించిన రష్మిక పూజలు చేసినట్లు తెలుస్తోంది.
పెళ్లి చేసుకున్నాక దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా కలకాలం కలసి ఉండేలా, జాతకంలో ఉన్న దోషాలను పోగొట్టుకునేందుకు.. కెరీర్ పరంగా ఇంకా పైకి ఎదగాలని చెప్పి.. రష్మిక పూజలు చేసి ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈవిషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
ఇక రష్మిక నటిస్తున్న మిషన్ మజ్ను, గుడ్ బై అనే మూవీలు షూటింగ్ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ మూవీలు రిలీజ్ కానున్నాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…