Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపించింది రాధేశ్యామ్ టీమ్.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకకు సుమారుగా 40 వేల మంది పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టి, అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ హోస్ట్ గా వ్యవహరించారు. అయితే అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన కటౌట్‌పై 40 మంది అభిమానులు ఎక్కారు. నిర్వాహకులు ఎంత కోరినా వారు కిందకు దిగలేదు.
అభిమానుల బరువుకు కటౌట్ కూలి కింద పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన చిత్ర బృందాన్ని కలవరపరుస్తోంది. మరోవైపు ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఫ్యాన్స్‌ని అదుపు చేయలేక లాఠీ ఛార్జ్ కూడా చేసినట్టు తెలుస్తోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ ను విడుదల చేయగా, ఇది ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగించింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…