Radhe Shyam : రాధే శ్యామ్ ఈవెంట్‌లో విషాదం.. క‌టౌట్ ప‌డ‌డంతో విష‌మంగా ఒకరి ఆరోగ్యం..

December 24, 2021 11:02 AM

Radhe Shyam : బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని రీతిలో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపించింది రాధేశ్యామ్ టీమ్.

Radhe Shyam pre release event incident one man condition is critical

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన‌ ఈ వేడుకకు సుమారుగా 40 వేల మంది పైగా ఫ్యాన్స్ హాజరయ్యారు. రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్‏కు జాతిరత్నం హీరో నవీన్ పోలిశెట్టి, అందాల ముద్దుగుమ్మ ర‌ష్మీ గౌత‌మ్ హోస్ట్ గా వ్యవహరించారు. అయితే అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ ఈవెంట్‌లో ఓ విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈవెంట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన‌ కటౌట్‌పై 40 మంది అభిమానులు ఎక్కారు. నిర్వాహకులు ఎంత కోరినా వారు కిందకు దిగలేదు.

అభిమానుల బరువుకు కటౌట్ కూలి కింద పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న చిత్ర బృందాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. మ‌రోవైపు ఈవెంట్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్‌ని అదుపు చేయ‌లేక లాఠీ ఛార్జ్ కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైల‌ర్ ను విడుద‌ల చేయ‌గా, ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి అనుభూతిని క‌లిగించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment