Ravindra Jadeja : తగ్గేదే లే.. అంటూ డైలాగ్‌ చెప్పిన రవీంద్ర జడేజా.. మాములుగా లేదుగా..!

December 24, 2021 12:51 PM

Ravindra Jadeja : డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్లను రాబ‌డుతూ రికార్డుల‌ని చెరిపేస్తోంది. ఈ క్ర‌మంలో పుష్ప చిత్ర బృందం ప‌లు ప్రాంతాల‌లో స‌క్సెస్ మీట్‌లు నిర్వ‌హిస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల‌లోనే కాకుండా ప‌లు ప్రాంతాల‌లోనూ పుష్ప మానియా న‌డుస్తోంది. కాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. అల్లు అర్జున్‌ ట్రాన్స్‌లో పడిపోయాడు.

Ravindra Jadeja said thaggede le dialogue in pushpa movie

పుష్ప సినిమాలో ‘తగ్గేదే లే’ అన్న డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ డైలాగ్‌కు సామాన్యుల‌తోపాటు సెల‌బ్స్ సైతం ప‌లు వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట‌ర్స్ కూడా రీల్స్ చేస్తుండడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. మొన్నటికి మొన్న ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అ‍ల్లు అర్జున్‌ను ఫేస్‌ మార్ఫింగ్‌ చేసి తగ్గేదే లే అంటూ డైలాగ్‌ చెప్పడం వైరల్‌గా మారింది.

https://www.instagram.com/p/CX0u9KvF7Kl/

తాజాగా ర‌వీంద్ర జ‌డేజా కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ”పుష్ప.. పుష్పరాజ్‌.. దీనమ్మ తగ్గేదే లే..” అంటూ సూపర్‌ మాడ్యూలేషన్‌తో చెప్పాడు. జడేజా చెప్పిన డైలాగ్‌ను మైత్రి మూవీ మేకర్స్‌ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా లైక్స్ రాగా, వేలల్లో కామెంట్లు వచ్చేశాయి. రవీంద్ర జడేజా తెలుగు సినిమా వీడియో చేయడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు టాలీవుడ్ అభిమానులు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now