Anil Kumar Yadav : ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం టీవీ సీరియల్‌ని తలపిస్తోంది. తరువాయి భాగం రేపు అన్నట్టుగా… రోజుకో మలుపు తిరుగుతోంది. సినీ ప్రముఖులు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దానిపై మంత్రులు ఘాటుగా స్పందించడం కొద్ది రోజులుగా నడుస్తూ వస్తోంది. రీసెంట్‌గా నాని టిక్కెట్లు రేట్లు తగ్గించడం ప్రేక్షకులని అవమానపరచడమే అని అన్నాడు. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతోపాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. నాని భజనపరుడని విమర్శించారు. సినిమా ఖర్చులో 80 శాతం రెమ్యునరేషన్‌కు వెళ్తుంటే, అసలు ఖర్చు 20 శాతమేనన్నారు. ఆ 80 శాతాన్ని ప్రేక్షకులపై రుద్దడం ఏంటని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చెంతో చెప్పాలన్నారు. ప్రజలని ఉద్ధరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా.. అంటూ సెటైర్లు సంధించారు. తనకున్న క్రేజ్‌ను పవన్ అమ్ముకొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టానంటూ చెప్పుకొచ్చారు. ప్రొడక్షన్ కాస్ట్ 30 శాతం అయితే రెమ్యునరేషన్ 70 శాతం ఉంది అని ఆయన మండిపడ్డారు. మరి దీనిపై పవన్ ఏమైనా స్పందిస్తారా.. అనేది చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…