Anil Kumar Yadav : బైక్ అమ్మి ప‌వ‌న్ క‌టౌట్‌లు క‌ట్టా.. ప్రజలని ఉద్ధరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా..

December 24, 2021 12:57 PM

Anil Kumar Yadav : ఏపీలో సినిమా టిక్కెట్ల వ్య‌వ‌హారం టీవీ సీరియ‌ల్‌ని త‌ల‌పిస్తోంది. తరువాయి భాగం రేపు అన్నట్టుగా… రోజుకో మలుపు తిరుగుతోంది. సినీ ప్ర‌ముఖులు ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం దానిపై మంత్రులు ఘాటుగా స్పందించ‌డం కొద్ది రోజులుగా న‌డుస్తూ వ‌స్తోంది. రీసెంట్‌గా నాని టిక్కెట్లు రేట్లు త‌గ్గించ‌డం ప్రేక్ష‌కుల‌ని అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే అని అన్నాడు. నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Anil Kumar Yadav said he sold bike once for pawan kalyan cut outs

మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కురసాల కన్నబాబుతోపాటు పలువురు నేతలు నాని కామెంట్స్ ను తప్పుబట్టారు. తాజాగా హీరో నాని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌. నాని భజనపరుడని విమర్శించారు. సినిమా ఖర్చులో 80 శాతం రెమ్యునరేషన్‌కు వెళ్తుంటే, అసలు ఖర్చు 20 శాతమేనన్నారు. ఆ 80 శాతాన్ని ప్రేక్షకులపై రుద్దడం ఏంటని ప్రశ్నించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న తెచ్చిన అనిల్‌ కుమార్ యాద‌వ్.. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చెంతో చెప్పాలన్నారు. ప్రజలని ఉద్ధరిస్తానన్న పవన్ తక్కువ రేటుకే వినోదాన్ని పంచొచ్చు కదా.. అంటూ సెటైర్లు సంధించారు. తనకున్న క్రేజ్‌ను పవన్ అమ్ముకొంటున్నారని విమర్శించారు. ఒకప్పుడు నేను కూడా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ కి కటౌట్ లు కట్టానంటూ చెప్పుకొచ్చారు. ప్రొడక్షన్ కాస్ట్ 30 శాతం అయితే రెమ్యునరేషన్ 70 శాతం ఉంది అని ఆయ‌న మండిప‌డ్డారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఏమైనా స్పందిస్తారా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now