Poorna : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు వరుసగా నిర్మాతలు లేదా దర్శకులు ఆఫర్లు ఇస్తున్నారంటే.. వారి మధ్య ఏదో ఉందని.. అందుకనే సదరు హీరోయిన్‌కు వరుస పెట్టి ఆఫర్లు ఇస్తున్నారని.. సహజంగానే రూమర్స్ వస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో అలాంటి రూమర్స్ నిజమే అవుతుంటాయి, కానీ అన్ని సందర్భాల్లోనూ అలా జరగదు.
కాంబో మాదిరిగా అదే హీరోయిన్‌తో చేస్తే సినిమా హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే వరుస ఆఫర్లను ఇస్తుంటారు. అయినప్పటికీ అలాంటి విషయాల్లో వచ్చే పుకార్లు మాత్రం ఆగవు. ఇక రవిబాబు, పూర్ణల గురించి కూడా ఇలాగే వార్తలు వచ్చాయి. వారిద్దరి మధ్య ఏదో ఉందని, అందుకనే రవిబాబు పూర్ణకు వరుస అవకాశాలు ఇచ్చారని.. అప్పట్లో టాక్ వినిపించింది. అయితే ఆ పుకార్లపై రవిబాబు స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
వరుసగా సినిమా ఆఫర్లను ఇచ్చినంత మాత్రాన అఫైర్ ఉందని ఎలా అనుకుంటారు ? ఆమె బాగా యాక్టింగ్ చేస్తుందని చెప్పే ఆమెకు వరుస ఆఫర్లను ఇచ్చా.. అంతేకానీ మా మధ్య ఏమీ లేదు.. అని ఆయన తెలిపారు. కాగా రవిబాబు డైరెక్షన్‌లో పూర్ణ.. అవును, అవును 2, లడ్డు బాబు వంటి సినిమాల్లో నటించింది. అవును, అవును 2 మూవీల్లో ఆమె చాలా బోల్డ్ గా నటించి అందరికీ షాకిచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…