Bigg Boss 5 Telugu : ప్రియాంక సింగ్‌కు షాక్‌.. ఆమెకు స‌పోర్ట్ చేసేది లేదంటున్న హిజ్రాలు..

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఎంతో ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. వారాలు గ‌డుస్తున్న కొద్దీ ఎవ‌రు ఎలిమినేట్ అవుతారా ? అన్న ఉత్కంఠ రోజు రోజుకీ పెరిగిపోతోంది. వారాంతాల్లో ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ప్రియాంక సింగ్ గేమ్ శైలి మార్చింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ప్రియాంక సింగ్ బిగ్ బాస్ ఇంట్లో కొంచెం యాక్టివ్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా మాన‌స్ చుట్టూ ఆమె తిరుగుతుండ‌డం.. ష‌ణ్ముఖ్‌తో గొడ‌వ‌లు చూస్తుంటే.. ప్రేక్ష‌కుల స‌పోర్ట్ కోస‌మే ఇదంతా చేస్తున్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఎంత చేసినా బ‌య‌టి నుంచి వ‌చ్చే ఓట్లు చాలా ముఖ్యం. క‌నుక ఆ దిశ‌గా కూడా ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుంది.

బ‌య‌టి వారు వేసే ఓట్లు బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు చాలా కీల‌కం. కొన్ని వారాలు కొన్ని స‌భ్యుల‌ను ఓట్ల‌తో ప‌నిలేకుండా ఎలిమినేట్ చేశారు. కానీ విశ్వ ఎలిమినేష‌న్‌లో ఓట్లే కీల‌కంగా ప‌నిచేశాయి. అత‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన‌ప్ప‌టికీ త‌క్కువ ఓట్లు వ‌చ్చిన కార‌ణంగా ఎలిమినేట్ అయ్యాడు. అందువ‌ల్ల ఓట్ల‌ను అంత త‌క్కువ చేసి చూడ‌రాద‌ని స్ప‌ష్ట‌మైంది. అయితే సీజ‌న్ మ‌రీ కీల‌క ద‌శ‌కు చేరుకుంటున్న స‌మ‌యంలో ప్రియాంక సింగ్‌కు హిజ్రాలు షాకిచ్చారు.

ప్రియాంక సింగ్ త‌మ‌కు ఎవ‌రో తెలియ‌ద‌ని, ఆమె త‌మ కమ్యూనిటీకి చెందిన‌వారు కాద‌ని, క‌నుక ఆమెకు స‌పోర్ట్ చేసేది లేద‌ని.. తెలంగాణ రాష్ట్ర సమితి హిజ్రా ఫౌండర్‌ చంద్రముఖి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సాధార‌ణంగా పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆడ ల‌క్ష‌ణాలు ఉండి ఆ త‌రువాత అమ్మాయిల్లా బ‌ట్ట‌లు వేసుకుని హిజ్రాగా మారితేనే ట్రాన్స్‌జెండ‌ర్ అంటార‌ని, అలాంటిది ప్రియాంక ఆడ‌పిల్లలా మారాల‌నే కోరిక‌తో ఆ విధంగా మారింద‌ని, క‌నుక ఆమె త‌మ క‌మ్యూనిటీ కాద‌ని తెలిపారు.

గ‌తంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న త‌మ‌న్నా సింహాద్రి త‌మ క‌మ్యూనిటీయే కాబ‌ట్టి ఆమెకు స‌పోర్ట్ చేశామ‌ని, కానీ ప్రియాంకకు స‌పోర్ట్ చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో ప్రియాంక సింగ్‌కు ఈ విష‌యం మైన‌స్ అవుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ప్రియాంక బ‌య‌టి వారి ఓట్లు రాబ‌ట్ట‌డంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM