Poorna : పూర్ణ‌కు అందుక‌నే ఆఫ‌ర్స్ ఇచ్చా.. అఫైర్ వార్త‌ల‌పై ర‌విబాబు స్పంద‌న‌..

November 11, 2021 8:25 AM

Poorna : సినిమా ఇండ‌స్ట్రీలో ఒక హీరోయిన్‌కు వ‌రుస‌గా నిర్మాత‌లు లేదా ద‌ర్శ‌కులు ఆఫ‌ర్లు ఇస్తున్నారంటే.. వారి మ‌ధ్య ఏదో ఉంద‌ని.. అందుకనే స‌ద‌రు హీరోయిన్‌కు వ‌రుస పెట్టి ఆఫ‌ర్లు ఇస్తున్నార‌ని.. స‌హ‌జంగానే రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. అయితే కొన్ని సంద‌ర్భాల్లో అలాంటి రూమ‌ర్స్ నిజ‌మే అవుతుంటాయి, కానీ అన్ని సంద‌ర్భాల్లోనూ అలా జ‌ర‌గ‌దు.

ravi babu told why he given offers to Poorna

కాంబో మాదిరిగా అదే హీరోయిన్‌తో చేస్తే సినిమా హిట్ అవుతుంద‌నే ఉద్దేశంతోనే వ‌రుస ఆఫ‌ర్ల‌ను ఇస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ అలాంటి విష‌యాల్లో వ‌చ్చే పుకార్లు మాత్రం ఆగ‌వు. ఇక ర‌విబాబు, పూర్ణ‌ల గురించి కూడా ఇలాగే వార్త‌లు వ‌చ్చాయి. వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని, అందుక‌నే ర‌విబాబు పూర్ణ‌కు వ‌రుస అవ‌కాశాలు ఇచ్చార‌ని.. అప్ప‌ట్లో టాక్ వినిపించింది. అయితే ఆ పుకార్ల‌పై ర‌విబాబు స్పందించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

వ‌రుస‌గా సినిమా ఆఫ‌ర్ల‌ను ఇచ్చినంత మాత్రాన అఫైర్ ఉంద‌ని ఎలా అనుకుంటారు ? ఆమె బాగా యాక్టింగ్ చేస్తుంద‌ని చెప్పే ఆమెకు వ‌రుస ఆఫ‌ర్ల‌ను ఇచ్చా.. అంతేకానీ మా మ‌ధ్య ఏమీ లేదు.. అని ఆయ‌న తెలిపారు. కాగా ర‌విబాబు డైరెక్ష‌న్‌లో పూర్ణ.. అవును, అవును 2, ల‌డ్డు బాబు వంటి సినిమాల్లో న‌టించింది. అవును, అవును 2 మూవీల్లో ఆమె చాలా బోల్డ్ గా న‌టించి అంద‌రికీ షాకిచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment