Poorna : గుండెల్ని పిండేసే వార్త చెప్పిన పూర్ణ‌.. పెళ్లి తేదీ ఫిక్స్.. ఇక సినిమాల‌కు గుడ్‌బై..?

July 4, 2022 9:26 AM

Poorna : న‌టి పూర్ణ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినిమాల క‌న్నా టీవీ షోల‌తోనే ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె అనేక చిత్రాల్లో న‌టించ‌గా.. అవ‌న్నీ హిట్ అయ్యాయి. ఇక అప్ప‌ట్లో కొన్ని సినిమాల్లో బోల్డ్ సీన్ల‌లోనూ ఈమె న‌టించింది. సీమ ట‌పాకాయ్ అనే సినిమా ద్వారా ఈమె టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. త‌రువాత ల‌డ్డూ బాబు, అవును, అవును 2, శ్రీ‌మంతుడు, సుంద‌రి వంటి చిత్రాల్లో న‌టించి న‌టిగా మంచి గుర్తింపు పొందింది. త‌రువాత తెలుగుతోపాటు త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌కు చెందిన సినిమాల్లోనూ న‌టించింది.

అయితే ఈమెకు ఆఫ‌ర్లు త‌గ్గ‌డంతో బుల్లితెర వైపుకు మళ్లింది. ఈ క్ర‌మంలోనే ఢీ 13వ సీజ‌న్‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించింది. ఇక ఇటీవ‌లే ఈమె త‌న‌కు ఎంగేజ్‌మెంట్ అయింద‌నే విష‌యాన్ని వెల్ల‌డించి అంద‌రికీ షాకిచ్చింది. షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్య‌క్తితో త‌న‌కు ఎంగేజ్‌మెంట్ జ‌రిగింద‌ని తెలియ‌జేసింది. ఆయ‌న విదేశాల‌కు వెళ్లే వారికి వీసాల‌ను అందించే సంస్థ‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇక పూర్ణ త‌న ఎంగేజ్‌మెంట్ విష‌యాన్ని చెప్ప‌గానే ఆమెది ప్రేమ వివాహ‌మ‌ని చాలా మంది పోస్టుల‌ను వైర‌ల్ చేశారు. దీంతో పూర్ణ స్పందించి త‌మ‌ది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి అని చెప్పింది.

Poorna wedding date fixed she may say good bye to movies
Poorna

కాగా పూర్ణ ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తాము ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నామ‌నే విష‌యాన్ని వెల్ల‌డించింది. న‌వంబ‌ర్ 6న త‌మ వివాహం జ‌రుగుతుంద‌ని చెప్పింది. అయితే ఎక్క‌డ జ‌రుగుతుంది.. అన్న వివ‌రాల‌ను మాత్రం వెల్ల‌డించ‌లేదు. ఇక పెళ్లి అయ్యాక సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్న పూర్ణ భ‌ర్త‌తో క‌లిసి దుబాయ్‌కి వెళ్లి అక్క‌డే సెటిల్ అవుతుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పెళ్లి తేదీ వ‌ర‌కు తాను చేస్తున్న సినిమాల‌ను పూర్తి చేయాల‌ని ఆమె ఆలోచిస్తున్న‌ద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment