Akhanda Movie : అందరి ముందే బాలయ్యకు సాష్టాంగ న‌మ‌స్కారం చేసిన పూర్ణ‌..!

December 10, 2021 1:09 PM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం మాస్ జనాలు మాత్రమే కాదు.. మహిళలు కూడా సినిమా చూసేందుకు క్యూ కడుతున్నారు. బాలయ్య సినిమాలపై ఆసక్తి చూపనివారు సైతం మౌత్ టాక్ చూసి మూవీ చూసేందుకు వెళ్తున్నారు. అఖండ మూవీ ఫస్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతుడ‌గా, నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల మార్క్ అందుకోబోతున్నారని స్పష్టమైంది.

Akhanda Movie poorna namaskar to balakrishna on stage

అఖండ‌మైన విజ‌యం సాధించిన నేప‌థ్యంలో చిత్ర విజ‌యోత్స‌వ వేడుక వైజాగ్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో న‌టి పూర్ణ మాట్లాడుతూ.. అఖండమైన విజయం మాది. ఇది ప్రేక్షకుల విజయం. అందరు అభిమానులు ఈ సినిమాను చూసి హిట్ చేశారు. బాలయ్య గారి గురించి చెప్పేందుకు మాటలు చాలడం లేదు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఇంత కంటే ఎక్కువ చెప్పలేను. ఈ సినిమాలో అఘోర పాత్ర నన్ను వెంటాడింది. మీలాంటి వారితో పని చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను అని చెప్పేసింది.

“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు పూర్ణ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now