Rashmika Mandanna : ప్లీజ్‌.. న‌న్ను చంపొద్దు.. అని సుకుమార్‌ను వేడుకున్న ర‌ష్మిక మంద‌న్న‌..?

July 9, 2022 7:49 AM

Rashmika Mandanna : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మందన్న కాంబినేష‌న్‌లో వచ్చిన పుష్ప మొద‌టి పార్ట్ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో పుష్ప‌గా అల్లు అర్జున్‌, శ్రీ‌వ‌ల్లిగా ర‌ష్మిక మందన్న డి-గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి అల‌రించారు. ఈ మూవీ ద్వారా బ‌న్నీ పాన్ ఇండియా హీరో కాగా.. ర‌ష్మిక‌కు కూడా బాలీవుడ్‌లోనూ మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. పుష్ప లో ఆమె రోల్ కార‌ణంగా ఆమెకు ర‌ణ‌బీర్ క‌పూర్ ప‌క్క‌న న‌టించే చాన్స్ కూడా వ‌చ్చింది.

ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న యానిమ‌ల్ అనే మూవీలో న‌టిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. కాగా టాలీవుడ్‌లో ర‌ష్మిక ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌ను అందుకుంది. కానీ బాలీవుడ్‌లో ఇంకా ఒక్క హిట్ కూడా ప‌డ‌లేదు. కానీ పుష్ప ద్వారా వ‌చ్చిన క్రేజ్‌ను ఆమె ఇంకా క్యాష్ చేసుకోవాల‌ని చూస్తోంది. అందుక‌నే పుష్ప 2లో ఎప్పుడెప్పుడు యాక్ట్ చేద్దామా.. అని ఎదురు చూస్తోంది. ఈ మూవీతో ఆమె కెరీర్ ఇంకా పీక్స్‌కు చేరే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే బాలీవుడ్‌లోనూ ఇంకా ఎక్కువ ఆఫ‌ర్లు వ‌చ్చే చాన్స్‌లు పెరుగుతాయి. అయితే ర‌ష్మిక ఆశ‌ల‌పై సుకుమార్ నీళ్లు చ‌ల్ల‌నున్నారా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. పుష్ప 2లో ఆమె పాత్ర కేవ‌లం స‌గం సినిమా వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంద‌ట‌.

Rashmika Mandanna special request about her story in Pushpa movie
Rashmika Mandanna

అయితే ఈ విషయం ఈ మ‌ధ్యే సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది. పుష్ప 2లో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌ను చంపేయ‌నున్నార‌ని టాక్ న‌డిచింది. కేజీఎఫ్ 2 కార‌ణంగా సుకుమార్ పుష్ప 2 క‌థ‌ను మొత్తాన్ని మార్చేశార‌ట‌. అందులో శ్రీ‌వల్లి క్యారెక్ట‌ర్ కూడా ఒక‌టి. ఈ పాత్రను అంత‌కు ముందు ఆయ‌న సినిమా మొత్తం పెట్టార‌ట‌. కానీ కేజీఎఫ్ 2 విడుద‌లై హిట్ అయ్యాక‌.. పుష్ప 2కు సుకుమార్ అనేక మార్పులు చేశార‌ట‌. అందులో భాగంగానే శ్రీ‌వ‌ల్లి పాత్ర‌ను ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో చంపేయాల‌ని అనుకున్నార‌ట‌. అందుకు అనుగుణంగానే క‌థ‌కు మార్పులు కూడా చేశార‌ట‌. అయితే ఈ వార్త‌లు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కాగానే ర‌ష్మిక హ‌డావిడిగా వెళ్లి సుకుమార్ ను క‌లిసిన‌ట్లు తెలిసింది.

పుష్ప 2లో త‌న పాత్ర‌ను చంపేయ‌బోతున్నార‌న్న వార్త‌ల‌పై ర‌ష్మిక.. ద‌ర్శ‌కుడు సుకుమార్‌ను క‌లిసి రిక్వెస్ట్ చేసింద‌ట‌. త‌న పాత్ర‌ను చంపేయ‌వ‌ద్ద‌ని కోరింద‌ట‌. అయితే ఆమెకు క‌థ‌ను ఆయ‌న చెప్ప‌లేద‌ట‌. కానీ ఆమెకు ఎలాంటి భ‌రోసా మాత్రం ల‌భించ‌లేద‌ట‌. ఎందుకంటే షూటింగ్ ఇంకా ప్రారంభ‌మే కాని సినిమాకు క‌థ‌ను ఆయ‌న ముందే ఎలా చెబుతారు. క‌నుక ఇప్ప‌టికైతే ఆయ‌న ఏమీ స్పందించ‌లేద‌ని తెలిసింది. కానీ షూటింగ్ మొద‌ల‌య్యాక ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే సుకుమార్ మాత్రం తాను మార్చిన క‌థ‌ను ఇక మ‌ళ్లీ మార్చ‌కూడ‌ద‌నే అనుకుంటున్నార‌ట‌. ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో శ్రీ‌వ‌ల్లి పాత్ర చ‌నిపోతే.. సెకండాఫ్‌లో ఇంకో హీరోయిన్‌ను చూపించ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment