Rashmika Mandanna : జిమ్‌లో తెగ సాధ‌న చేస్తున్న ర‌ష్మిక మంద‌న్న‌.. మ‌తులు పోగొడుతున్న వీడియో..!

March 29, 2022 11:29 AM

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరుగాంచిన ర‌ష్మిక మందన్న పుష్ప సినిమాతో ఒక్క‌సారిగా మ‌రింత పాపుల‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు అనేక సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అటు హిందీలో.. ఇటు తెలుగులో ఈమె ఎంతో బిజీగా ఉంది. ఇక ఫిట్‌నెస్ విష‌యంలో ఎక్కువ‌గా శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచే ర‌ష్మిక మంద‌న్న త‌ర‌చూ జిమ్‌లో గంట‌ల త‌ర‌బ‌డి సాధ‌న చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె మ‌రోమారు ఫిట్ నెస్ సెష‌న్‌లో పాల్గొంది.

Rashmika Mandanna latest gym workout video viral
Rashmika Mandanna

ర‌ష్మిక మంద‌న్న జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హీరోయిన్లు అన్నాక ఫిట్‌నెస్ విష‌యంలో ఆమాత్రం శ్ర‌ద్ధ వ‌హిస్తారు. అయితే ర‌ష్మిక మంద‌న్న మాత్రం ఈ విష‌యంలో కాస్త పై స్థానంలోనే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. న‌డుము కింది నుంచి కాళ్లు మొత్తం క‌నిపించేలా డ్రెస్ ధ‌రించి ఈమె వ‌ర్క‌వుట్స్ చేస్తున్న దృశ్యాలు మ‌తులు పోగొడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈమె వీడియో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇక ర‌ష్మిక మంద‌న్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్‌లో ఈమె మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే మూవీల్లో న‌టిస్తోంది. త్వ‌ర‌లో పుష్ప 2 చిత్రం షూటింగ్‌లోనూ ఆమె పాల్గొన‌నుంది. ఇటీవ‌లే ఈమె న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఈ మూవీ పెద్ద‌గా హిట్ కాలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment