Rashmika Mandanna : డ్యాన్స్ వీడియోతో ఇర‌గ‌దీసిన ర‌ష్మిక మంద‌న్న‌.. వీడియో వైర‌ల్‌..!

April 3, 2022 7:47 AM

Rashmika Mandanna : టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవ‌రు ? అని అడిగితే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు.. ర‌ష్మిక మంద‌న్న‌. ఈ భామ గ‌తేడాది కాలంగా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఉన్న ఈమె పుష్ప అందించిన ఊపుతో బాలీవుడ్‌లోనూ పాగా వేస్తోంది. ప‌లు వ‌రుస సినిమాల‌తో ఈమె బాలీవుడ్‌లోనూ బిజీగా ఉంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ ర‌ష్మిక ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందులో పోస్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఓ ఆడియో ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌కు ఆమె యాడ్ చేసింది. అందులో డ్యాన్స్ ఇర‌గ‌దీసింది.

Rashmika Mandanna  latest dance video viral
Rashmika Mandanna

డ్యాన్స్ త్రూ లైఫ్ పేరిట ఆమె చేసిన ఓ మ్యూజిక్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇందులో ఓ పాప్ సాంగ్‌కు ర‌ష్మిక స్టెప్స్ వేయ‌డాన్ని చూడ‌వ‌చ్చు. ఆ బ్రాండ్‌కు ఆమె ప్ర‌మోట‌ర్‌గా ఉంది. అందుక‌నే ఈ యాడ్‌లో న‌టించింది. ఇక ఈ మ్యూజిక్ వీడియోను ఎంతో మంది ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by boAt (@boat.nirvana)

కాగా ర‌ష్మిక మంద‌న్న సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈమె త్వ‌ర‌లోనే పుష్ప 2 షూటింగ్‌లో పాల్గొన‌నుంది. ఈ మ‌ధ్యే ఈమె న‌టించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే మూవీ రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్న విజ‌యాన్ని సాధించ‌లేదు. ఇక మిష‌న్ మ‌జ్ను, గుడ్ బై అనే హిందీ సినిమాల్లో ఈమె న‌టిస్తుండ‌గా.. సందీప్ రెడ్డి వంగా చేయ‌బోతున్న యానిమ‌ల్ అనే హిందీ మూవీలోనూ ఈమె చాన్స్ కొట్టేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment