Rashmika Mandanna : రష్మిక మంద‌న్న‌పై నెటిజన్ల ఆగ్ర‌హం.. ఇంత‌కీ అసలు విష‌యం ఏమిటి..?

April 24, 2022 12:58 PM

Rashmika Mandanna : ఇటీవ‌లి కాలంలో చాలా మంది స్టార్స్ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టిస్తూ నెటిజ‌న్స్ ఆగ్ర‌హానికి గుర‌వుతున్నారు. అక్ష‌య్ కుమార్, అజ‌య్ దేవ‌గ‌న్‌ వంటి వారు తాము చేసిన త‌ప్పుల‌ని గ్ర‌హించి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అల్లు అర్జున్ అయితే పొగాకు ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు ఆస‌క్తి కూడా చూప‌లేదు. డ‌బ్బుల కోసం త‌ప్పుడు ప్ర‌క‌ట‌నలు చేస్తే అభిమానుల ఆగ్ర‌హానికి త‌ప్ప‌క గుర‌వుతున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ర‌ష్మిక చేసిన యాడ్ ఇప్పుడు ఒక‌టి వివాదాస్ప‌దంగా మారింది. ఆమె అభిమానులు ర‌ష్మిక‌పై ఆగ్ర‌హంగా ఉన్నారు.

Rashmika Mandanna Kingfisher ad netizens angry
Rashmika Mandanna

నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన ర‌ష్మిక ప్ర‌స్తుతం సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ వ‌రుస సినిమాలు చేస్తోంది. హిందీలో హీరోయిన్‌ రష్మిక‌ మందన్నా క్రేజ్‌ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన మిషన్‌ మజ్నులో హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌కు రష్మిక పరిచయం కాబోతుంది. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ లీడ్‌ రోల్‌ చేసిన డాడీ (ప్రజెంట్‌ టైటిల్‌) చిత్రంలో రష్మిక మరో లీడ్‌ క్యారెక్టర్ చేసింది. తండ్రీకూతుళ్ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్‌ బాల్‌ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది.

https://youtu.be/-DFwZy8XSh4

కాగా ర‌ష్మిక తాజాగా హీరో వరుణ్‌ ధావన్‌తో క‌లిసి కింగ్ ఫిషర్ సోడా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో శ‌నివారం విడుద‌ల కాగా.. దీనిపై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి హాని చేసేటువంటి వాటిని ఎందుకు ఎంక‌రేజ్ చేస్తున్నారు.. అంటూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రకటనలో, వరుణ్ పాప్ స్టార్‌గా కనిపిస్తాడు, అతను వేదికపై తనతో కలిసి డాన్స్ చేయడానికి రష్మికను ఆహ్వానిస్తాడు. ఇద్దరూ కలిసి ఒక క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ, ఆ తర్వాత బీచ్‌లో కనిపిస్తారు. కింగ్ ఫిష‌ర్ యాడ్ కోసం వీరిద్ద‌రూ చేసిన ర‌చ్చ కొంద మందికి న‌చ్చినా మ‌రి కొంద‌రు మాత్రం దీనిని వ్య‌తిరేకిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment