Rashmika Mandanna : ఆ పోస్ట్ తో విజ‌య్‌, ర‌ష్మిక రిలేష‌న్‌షిప్.. క‌న్‌ఫామ్ అయిన‌ట్లే..?

July 3, 2022 8:43 AM

Rashmika Mandanna : డాషింగ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న పూరీ జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి తెరకెక్కిస్తున్న చిత్రం.. లైగ‌ర్‌. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ ఇందులో విజ‌య్ కి గురువుగా న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ మూవీలో విజ‌య్ లుక్‌కు సంబంధించి మ‌రో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో విజ‌య్ పూర్తిగా న‌గ్నంగా క‌నిపిస్తూ కింది భాగంలో ఒక బొకే అడ్డుగా పెట్టుకుని ఉన్నాడు. పైగా సిక్స్ ప్యాక్‌లో క‌నిపిస్తున్నాడు. దీంతో ఈ ఫొటో ఎంతో మందిని ఆక‌ట్టుకుంటోంది. విజ‌య్ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

లైగ‌ర్ మూవీ నుంచి రిలీజ్ అయిన విజ‌య్ ఫొటోకు హీరోయిన్లు అంద‌రూ లైక్ కొట్ట‌డ‌మే కాకుండా.. విజ‌య్‌ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తుతున్నారు. అయితే అంద‌రూ సాధార‌ణంగానే విషెస్ చెప్పారు కానీ.. ర‌ష్మిక పెట్టిన పోస్ట్‌.. అందుకు విజ‌య్ ఇచ్చిన రిప్లై.. ప్ర‌ధానంగా నెటిజన్ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వారి పోస్టుల కార‌ణంగా వారి రిలేష‌న్ షిప్ క‌న్‌ఫామ్ అయింద‌ని అంటున్నారు. ర‌ష్మిక ఏమ‌ని పోస్ట్ చేసిందంటే.. నువ్వు నాకు ఇన్‌స్పిరేష‌న్ అని పెట్టింది.

Rashmika Mandanna and Vijay Devarakonda yet again in news with their posts
Rashmika Mandanna

ఇక అందుకు విజ‌య్ దేవ‌రకొండ కూడా రిప్లై ఇచ్చాడు. రుషి.. గీత గోవిందం నుంచి నువ్వే నా వ‌ర్క‌వుట్ మోటివేష‌న్‌.. ఈ ప్ర‌పంచం త‌ప్ప‌కుండా చూస్తుంది.. ఇది నా ప్రామిస్‌.. బిగ్ ల‌వ్‌.. అంటూ ల‌వ్ ఎమోజీల‌ను పెట్టాడు. దీంతో వీరి పోస్ట్‌లు కాస్తా వైర‌ల్ అవుతున్నాయి. ర‌ష్మిక‌కి ఎంత ద‌గ్గ‌ర‌గా లేకుంటే విజ‌య్ ఆమెను అలా రుషి.. అని పిలుస్తాడు.. క‌చ్చితంగా వీరు రిలేష‌న్‌లో ఉన్నారు.. పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగే ఉంటారు.. అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు వీరి ల‌వ్ ట్రాక్ మ్యాట‌ర్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment