Rashmi Gautam : ఆ బాధను వారు కూడా అనుభవిస్తారు.. ఆ సంఘటనపై రష్మి ఎమోషనల్..

February 2, 2022 6:31 PM

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తున్న రష్మి గౌతమ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్‌ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ అనసూయకు వచ్చినంత పేరు ఈమెకు రాలేదు. అనసూయ మాత్రం సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అయితే యాంకర్‌గా మాత్రం రష్మి గౌతమ్‌ ఆకట్టుకుంటోంది.

Rashmi Gautam gets emotional on that incident
Rashmi Gautam

ఇక రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలను అందులో ఆమె షేర్‌ చేస్తుంది. గ్లామర్‌ ఫొటోలను పోస్ట్‌ చేస్తుంటుంది. రష్మి గౌతమ్‌ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో.. అంతే విధంగా జంతువులను కూడా ఒక రేంజ్‌లో ప్రేమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు అంటే ఆమెకు ప్రాణం.

మూగ జీవాలను హింసించారనే వార్తలపై ఆమె ఎల్లప్పుడూ స్పందిస్తుంటుంది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతుంటుంది. ఇక తాజాగా ఇలాంటిదే ఓ సంఘటనపై ఆమె స్పందించింది.

బెంగళూరులో ఓ యువకుడు తన అపార్ట్‌మెంట్‌ వద్ద కారు నడుపుతూ అక్కడే పడుకుని ఉన్న ఓ కుక్కను తొక్కించాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది. అయితే ఆ యువకుడిది బడా ఫ్యామిలీ అయినప్పటికీ పోలీసులు అవేమీ లెక్క చేయకుండా అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే రష్మి స్పందిస్తూ.. ఆ పోలీసులను అభినందించింది. కొందరు డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చని అనుకుంటారని.. కానీ బుద్ధిని కొనలేమని.. ఇలాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అలాగే మూగ జీవాలను అలా హింసించే వాళ్లు వారు కూడా అదే బాధను అనుభవిస్తారని ఆమె పేర్కొంది. కుక్కలను రాళ్లతో కొట్టడం చిన్నతనంలో నేర్పిస్తే వారు పెద్దయ్యాకే ఇలాగే చేస్తారని అభిప్రాయపడింది. కాగా రష్మి వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment