Rashmi Gautam : ఆ వ్యక్తి దిగజారి పోయాడు.. ఫైరవుతున్న యాంకర్ రష్మి..!

November 4, 2021 12:30 PM

Rashmi Gautam : బుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా రష్మీ ఎంతో పేరు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతోంది. స్టార్ యాక్టర్ గా కొనసాగుతున్న రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె తనకు సంబంధించిన విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. అలాగే మూగజీవాల పట్ల స్పందిస్తూ ఉంటుంది. వాటికి ఏదైనా జరిగితే ఆమె అస్సలు ఊరుకోదు.

మూగజీవాల పట్ల ఎంతో ప్రేమ చూపించే రష్మీ వాటికి ఏమైనా అయితే మాత్రం వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటుంది. గతంలో లాక్ డౌన్ సమయంలో ఈమె ఎన్నో మూగజీవాలకు ఆహారం పెట్టి వాటి పట్ల తనకున్న ప్రేమను చాటుకుంది. హైదరాబాద్ నగర వీధులలో కుక్కలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసి వాటి సంరక్షణ చేపట్టాలని సూచించింది.

ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి సోషల్ మీడియా వేదికగా మూగజీవాల పట్ల ఉన్న తన ప్రేమను తెలియజేసింది. మూగజీవాలను ఎవరైనా హింసిస్తే వారికి తనదైన శైలిలో లెఫ్ట్ రైట్ ఇస్తోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి తను పెంచుకున్న కుక్కను ఎంతో దారుణంగా హింసిస్తూ కనిపించాడు. ఈ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రష్మి.. ఈ వ్యక్తి మానవత్వం మరిచి పోయి ఎంత దిగజారి పోయాడు. ఇలాంటి వారికి భూమి మీద ఉండే అర్హత లేదు.. అంటూ ఘాటుగా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment