Rashmi Gautam : స‌మంత త‌రువాత‌.. ఇప్పుడు ర‌ష్మి వంతు..!

November 25, 2021 9:59 AM

Rashmi Gautam : ప్ర‌స్తుత త‌రుణంలో హీరోయిన్లు కేవ‌లం సినిమా అవ‌కాశాల కోస‌మే చూడ‌డం లేదు. సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసే అవ‌కాశం వ‌చ్చినా స‌రే చేస్తున్నారు త‌ప్ప వ‌దులుకోవ‌డం లేదు. ఇక ఈ మ‌ధ్య కాలంలో సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేస్తున్న హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది.

Rashmi Gautam doing item number in chiranjeevi bhola shankar movie

సినిమాల్లో ఐట‌మ్ సాంగ్స్ చేసే విష‌యానికి వ‌స్తే త‌మ‌న్నా ఆ జాబితాలో ముందు వ‌రుస‌లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ మ‌ధ్యే స‌మంత పుష్ప మూవీలో ఐట‌మ్ సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఒక ఐట‌మ్ సాంగ్ చేసేందుకు స‌మంత ఏకంగా రూ.1.50 కోట్లు తీసుకోబోతుంద‌ని స‌మాచారం. అయితే బుల్లితెర‌పై యాంక‌ర్‌గా రాణిస్తున్న ర‌ష్మి గౌతమ్‌ను ఓ ఆఫ‌ర్ వ‌రించింది. ఆమె మెగాస్టార్ ప‌క్క‌న డ్యాన్స్ చేసే చాన్స్ కొట్టేసింది.

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం భోళా శంక‌ర్‌. ఈ మూవీలో ఐట‌మ్ సాంగ్ కోసం ర‌ష్మి గౌత‌మ్‌ను తీసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమె త్వ‌ర‌లో ఈ మూవీలో ఓ పాట‌లో చిరంజీవితో క‌లిసి డ్యాన్స్ చేయ‌నుంది. ఈమేర‌కు ర‌ష్మి గౌత‌మ్ త‌న అంగీకారం కూడా తెలిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆమె ఐట‌మ్ సాంగ్‌లో ఏ మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment