The Warriorr : యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ.. ది వారియర్. ఈ మూవీ ఈ నెల 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ మూవీకి గాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ యాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ది వారియర్ మూవీకి చెందిన డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ రామ్ ది వారియర్ మూవీకి చెందిన హక్కులను కొన్నారు కనుక.. వారి ఖాతాలో మరో బిగ్ మూవీ వచ్చి చేరింది. ఇప్పటికే భీమ్లా నాయక్, అఖండ, విక్రమ్ వంటి చిత్రాలను దక్కించుకున్న హాట్ స్టార్ సంస్థ ది వారియర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానుంది. దేశంలో ఓటీటీ యాప్‌లలోనూ హాట్ స్టార్ నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం.
ఇక ది వారియర్ మూవీ ఈనెల 14వ తేదీన రిలీజ్ అవుతుంది కనుక నాలుగు వారాల్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 14వ తేదీ వరకు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక ఈ మూవీని పలు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి లింగుసామి దర్శకత్వం వహించగా.. రామ్ పక్కన కృతిశెట్టి హీరోయిన్ గా చేసింది. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ హిట్ అవుతుందని, తప్పక ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…