The Warriorr : రామ్ న‌టించిన ది వారియ‌ర్ మూవీ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్‌.. ఎందులో.. ఎప్పుడు అంటే..?

July 13, 2022 7:40 PM

The Warriorr : యంగ్ హీరో రామ్ పోతినేని న‌టించిన లేటెస్ట్ మూవీ.. ది వారియ‌ర్‌. ఈ మూవీ ఈ నెల 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాట‌లు, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. కాగా ఈ మూవీకి గాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. ప్ర‌ముఖ ఓటీటీ యాప్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ది వారియ‌ర్ మూవీకి చెందిన డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సంస్థ రామ్ ది వారియ‌ర్ మూవీకి చెందిన హ‌క్కుల‌ను కొన్నారు క‌నుక‌.. వారి ఖాతాలో మ‌రో బిగ్ మూవీ వ‌చ్చి చేరింది. ఇప్ప‌టికే భీమ్లా నాయ‌క్‌, అఖండ‌, విక్ర‌మ్ వంటి చిత్రాల‌ను ద‌క్కించుకున్న హాట్ స్టార్ సంస్థ ది వారియ‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కానుంది. దేశంలో ఓటీటీ యాప్‌ల‌లోనూ హాట్ స్టార్ నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉండ‌డం విశేషం.

Ram Pothineni The Warriorr movie OTT platform fixed
The Warriorr

ఇక ది వారియ‌ర్ మూవీ ఈనెల 14వ తేదీన రిలీజ్ అవుతుంది క‌నుక నాలుగు వారాల్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఆగ‌స్టు 14వ తేదీ వ‌ర‌కు ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. ఇక ఈ మూవీని ప‌లు య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కించామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఈ మూవీకి లింగుసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. రామ్ ప‌క్క‌న కృతిశెట్టి హీరోయిన్ గా చేసింది. మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ హిట్ అవుతుంద‌ని, త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment