Rakul Preet Singh : మా వ్య‌క్తిగ‌త జీవితం గురించి మీకెందుకు ? మా సినిమాల గురించి మాట్లాడుకోండి: ర‌కుల్ ప్రీత్ సింగ్

May 23, 2022 3:49 PM

Rakul Preet Singh : టాలీవుడ్‌లో అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎద‌గిన న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్‌. కుర్ర హీరోయిన్ల రాక‌తో ఈ సీనియ‌ర్ హీరోయిన్‌కు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాయి. అయిన‌ప్ప‌టికీ ఈమె హిందీలో వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంటోంది. ఇక ఈ మ‌ధ్యే ర‌న్‌వే 34 అనే సినిమా ద్వారా ఈమె మ‌రోమారు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు ఈ సినిమా విడుద‌ల సంద‌ర్బంగా ఓ ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

ర‌కుల్ ప్రీత్ సింగ్ గతేడాది తాను జాకీ భ‌గ్నాని అనే హిందీ నిర్మాత‌తో ల‌వ్‌లో ఉన్న‌ట్లు చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే దీనిపైనే ఆమె మాట్లాడింది. తాను త‌న ప్రియుడి గురించి ముందే చెప్పాన‌ని.. లేదంటే మీడియా వారు ఉన్న‌వి లేనివి క‌ల్పించి రాస్తార‌ని.. అది త‌న‌కు ఇష్టం లేద‌ని ఈ అమ్మ‌డు తెలియ‌జేసింది. ఇక సెల‌బ్రిటీని క‌నుక స‌హ‌జంగానే త‌న వ్య‌క్తిగ‌త జీవితంలోకి తొంగి చూడాల‌ని చాలా మంది అనుకుంటార‌ని.. కానీ త‌మ వ్య‌క్తిగ‌త జీవితం గురించి ప‌ట్టించుకోవ‌ద్ద‌ని.. త‌మ సినిమాల గురించి మాట్లాడుకోవాల‌ని.. ఆమె హిత‌వు ప‌లికింది.

Rakul Preet Singh asked not to talk about her personal life
Rakul Preet Singh

ఇక జాక్నీ భ‌గ్నానికి, త‌న‌కు మ‌ధ్య బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్లు వివ‌రించింది. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.. అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ఈ బ్యూటీ స‌మాధానం చెప్ప‌లేదు. జీవితంలో అన్న‌, అక్క‌, చెల్లి, తండ్రి, త‌ల్లి.. ఎలాగో భ‌ర్త కూడా అలాగేన‌ని.. త్వ‌ర‌లో తాము పెళ్లి చేసుకుంటే త‌మ గురించి ఎలాంటి నెగెటివ్ వార్త‌లు రావొద్ద‌ని.. అందుక‌నే జాకీ భ‌గ్నాని గురించి ముందుగానే చెప్పాన‌ని ర‌కుల్ స్ప‌ష్టం చేసింది. ఇక ఈమె ప్ర‌స్తుతం మిష‌న్ సిండ్రెల్లా, డాక్ట‌ర్ జి, థాంక్ గాడ్, అల‌యాన్ అనే సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment