Rajinikanth : ప్రేమ పెళ్లిళ్ల విషయంలో సామాన్యులే కాదు సెలబ్రెటీలైనా ఒకటే. అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోల వివాహాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముచ్చటగా మూడు సంవత్సరాలు గడవకముందే విడాకులతో దూరమవుతున్నారు. మన ముందు తరం హీరోల లవ్ స్టోరీలు చాలా మందికి తెలియకపోవచ్చు. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా తన నిజమైన ప్రేమను చాటుతూ ఇప్పటికి కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారితో సంతోషంగా గడుపుతారు. అలాంటి లవ్ స్టోరీనే సూపర్ స్టార్ రజనీకాంత్, లత దంపతులది. వీరిది ప్రేమ వివాహమని చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే రజనీకాంత్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి బయటకు పెద్దగా వెల్లడించరు.
1980లో రజనీకాంత్ తిల్లు మల్లు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఆ సినిమా షూటింగ్ సమయంలో కాలేజీ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల వయసున్న లతా రజినీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారట. ఎతిరాజ్ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్న లతా, రజినీ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తుండగా ప్రేమ ఏర్పడింది. ఇంటర్వ్యూ పూర్తి కాగానే రజనీకాంత్ చెప్పిన తదుపరి విషయం ఏమిటంటే లతాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. రజినీకాంత్ ఆకస్మిక ప్రతిపాదనకు లతా ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా ఆమె మొదట తన తల్లిదండ్రులతో మాట్లాడాలని కోరిందట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తర్వాత లతా రజనికాంత్ కి రెండు రోజుల పాటు కనిపించలేదట. దీంతో రజనీకాంత్ లత కోసం ఎదురు చూస్తూనే షూటింగ్ పనులలో బిజీ అయ్యారు. మూడు రోజుల అనంతరం లత కనిపించడంతో ఆమెను చూసి రజనీకాంత్ షాక్ అయ్యారు.
ఎందుకంటే లత తలపై జుట్టు లేకుండా గుండుతో కనిపించడంతో రజనీకాంత్ షాక్ తిన్నారు. ఎందుకిలా గుండు చేయించుకున్నావు అని అడిగితే లత సమాధానం విని రజనీకాంత్ ఆశ్చర్యపోయారు. మీరంటే నాకు ప్రాణం, మీ మనసు ఎక్కడ మారుతుందోనని భయం వేసింది. అందుకే మీ మనసు మారకుండా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకనే తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నాను అని లత చెప్పడంతో రజనీపై ఆమెకు ఉన్న ప్రేమను అర్థం చేసుకొని లత కుటుంబ సభ్యుల ఆమోదంతో ఇద్దరూ 26 ఫిబ్రవరి 1981న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహమై దాదాపు 40 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎంతో అన్యోన్యంగా మెలగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రజినీకాంత్, లతా జంట.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…