Anjeer : ఒంట్లో నలతగా ఉన్నా.. జ్వరంతో బాధ పడుతున్నా అంజీరను తినమని సలహా ఇస్తారు. ఒత్తిడిని తగ్గించే అంజీర పండ్లకు వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల సంవత్సరాల కిందటే అంజీర సాగు చేయడం మొదలైందట. ప్రస్తుతం ప్రపంచమంతటా అంజీర్‌ను పండిస్తున్నారు. వగరు, తీపి, పులుపు కలగలిసి ఉండే ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజీర డ్రై ఫ్రూట్ ఏడాది పొడవునా మార్కెట్‌లలో దొరుకుతూనే ఉంటుంది. వీటిని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను ఎలా తిన్నా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ప్రధానంగా రెండు అంజీర్ పండ్లను నిత్యం భోజనానికి ముందు తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అంజీర్ పండ్లను రెండింటిని తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నానిన అంజీర్ పండ్లను తింటూ ఆ నీటిని తాగాలి. ఇలా తినటం కష్టంగా ఉంటే నానిన అంజీర్ ని మెత్తని పేస్ట్ గా చేసుకొని తినవచ్చు. అంజీర్ పండ్లలో ఫైబర్ కావల్సినంత ఉంటుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరమవుతాయి. అంజీర్‌లో పొటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇవి బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.
నిత్యం రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్‌లెట్లు తగ్గిన వారికి ఈ పండ్లను తినిపిస్తే వెంటనే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి. అంజీర్ పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేము. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.
అంజీర్ పండ్లలో మెగ్నిషియం, మాంగనీస్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాలనుకునే వారికి మేలు చేస్తాయి. అంజీర్ పండ్లు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి. భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. అంజీర్ పండ్లలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢమవుతాయి. కాబట్టి రోజుకి రెండు అంజీర్ పండ్లను తిని ఆరోగ్యంగా ఉండండి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…