Sarkaru Vaari Paata : యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. డిఫరెంట్ కథాంశంతో దర్శకుడు పరశురామ్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటాయి. యువత, సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి లవ్ అండ్ యాక్షన్ కథాంశాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు డైరెక్టర్ పరుశురాం. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. గీత గోవిందం సక్సెస్ తో పరశురామ్ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. స్టార్ హీరోలు కూడా ఆయన చిత్రాల్లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
గీత గోవిందం చిత్రం తర్వాత పరుశురాం డైరెక్షన్ లో స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించగా ఈ ఏడాది మే 12న విడుదలైన చిత్రం సర్కారు వారి పాట. సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సర్కారు వారి పాట చిత్రానికి ఫస్టాఫ్ అదుర్స్, సెకండాఫ్ వేస్ట్ అంటూ టాక్ వినిపించినా, వచ్చిన కామెంట్స్ అన్నింటిని పక్కకు నెట్టివేస్తూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ సంస్థల వారికి దాదాపు రూ.190 కోట్లను కలెక్షన్లు రాబట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపించింది.
ఇంత ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురామ్ మొదటిగా అల్లు అర్జున్ హీరోగా అనుకున్నారట. కానీ అల్లుఅర్జున్ అప్పటికే పుష్ప సినిమాకి ఓకే చెప్పడంతో ఈ కథ కాస్త మహేష్ బాబు చెంతకు చేరింది. పుష్ప చిత్రం పాన్ ఇండియా చిత్రం కావడంతో అల్లు అర్జున్ పుష్పలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు. మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో ఫుల్ గ్లామరస్ రోల్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తమన్ అందించిన మ్యూజిక్ సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని దక్కించుకుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…