Raja Ravindra : ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు రాజా రవీంద్ర. రాజా రవీంద్ర మొదట హీరోగా చేసిన కొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఈయన నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాదు పలువురు హీరోలకి మేనేజర్ గా కూడా వర్క్ చేశాడు. తెలుగులో నిఖిల్, నవీన్ చంద్ర, మంచు విష్ణు, రాజ్ తరుణ్ ఒకప్పుడు రవితేజ, స్టార్ హీరోస్ కి కూడా మేనేజర్ గా చేశాడు. రవితేజ రాజా రవీంద్ర వల్లే ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తూ రవితేజను గైడ్ చేస్తూ వచ్చాడు.
తర్వాత కొన్ని కారణాలతో వీరిద్దరికీ మ్యాటర్ చెడింది అని.. అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల రాజా రవీంద్ర ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశాడు. స్టార్ హీరోలకు మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్లకు ఎందుకు భయపడిపోతారు ? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా ? అని యాంకర్ అడగ్గా.. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. నేను హీరోలకి మేనేజర్ గా చేశాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్యనే. హీరోలు 2,3 సినిమాలు ఓకే చేసి.. అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఒకేసారి 5,6 సినిమాలు ఓకే చేస్తారు.
ఈ రోజు ఇక్కడ ఉంటే.. రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఫ్లైట్స్ డిలే అవుతాయి. ఒక సందర్భంలో సౌందర్య ఒకేసారి 3 సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా.. తెలుగులో చిరంజీవి సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా.. మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడూ హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో రాజా రవీంద్ర మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల మేనేజర్లు ఇంత కష్టపడతారా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…