Raja Ravindra : పగలు పేపర్ మిల్లులో పని చేసి.. రాత్రి చదువుకొని ఈ స్థాయిలో ఉన్నా: నటుడు రాజా రవీంద్ర!

November 5, 2021 4:25 PM

Raja Ravindra : తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఎంతో మంది హీరో హీరోయిన్లకు మేనేజర్ గా పనిచేసిన నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. తన అసలు పేరు రమేష్ దంతులూరు అని తెలిపారు. అయితే ఇండస్ట్రీలో ఆ పేరుతో చాలామంది ఉండటం చేత తన పేరును రాజారవీంద్రగా మార్చుకున్నానని తెలియజేశారు.

Raja Ravindra  said he worked in a paper mill and studied at night

తనకు ఇండస్ట్రీ లోకి రాకముందు మార్కెట్ రంగంలో పని చేయాలని ఎంతో కోరికగా ఉండేదని ఈ క్రమంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో ఒక పేపర్ మిల్ స్థాపించినట్లు ఈ సందర్భంగా రవీంద్ర తెలియజేశారు. ఇక పగలంతా పేపర్ మిల్లులో పనిచేస్తూ రాత్రిపూట చదువుకునే వాడినని, ఇలా పేపర్ మిల్లులో పనిచేస్తున్న సమయంలో తను డాన్స్ చేయడం తన పెదనాన్న చూసి తనని చెన్నైలోని ఒక డాన్స్ స్కూల్‌లో చేర్పించి తనకు శిక్షణ ఇప్పించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

అలా శిక్షణ అనంతరం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాననీ, ఎన్నో కష్టాలను అనుభవించి ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర తన సినీ కెరీర్ గురించి తెలియజేశారు. ఇక రవితేజ, నవీన్ చంద్ర, జయసుధ వంటి వారికి మేనేజర్ గా పని చేసినట్లు ఆయన తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment