Rahul Sipligunj : ముంబై వీధుల్లో ఆటో న‌డిపిన తెలుగు బిగ్ బాస్ విన్న‌ర్..!

December 22, 2021 4:24 PM

Rahul Sipligunj : బిగ్ బాస్ కార్య‌క్ర‌మంతో చాలా మంది లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు. కొంద‌రికి బిగ్ బాస్ మంచి క్రేజ్‌ని తెచ్చి పెట్టింది. అలా బిగ్ బాస్ తో మంచి క్రేజ్ అందుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ఈయ‌న అనేక సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ పాడినప్పటికీ ఆర్థికంగానూ కెరియర్ పరంగానూ ఎదగలేకపోయాడు. సాంగ్స్ పాడటం ద్వారా వచ్చిన డబ్బుల్ని మ్యూజిక్ ఆల్బమ్స్ పెట్టి చాలా వరకూ చేతులు కాల్చుకున్నాడు.

Rahul Sipligunj drove auto rikshaw in Mumbai

రాహుల్ సిప్లిగంజ్‌కి ఎఫైర్స్ త‌క్కువేమీ కాదు. హౌజ్‌లో ఉన్న‌ప్పుడు పున‌ర్న‌వితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న‌ట్టు కనిపించాడు. బ‌య‌ట‌కు వచ్చాక అషూ రెడ్డితో తెగ సంద‌డి చేశాడు. ఇద్దరూ కలిసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తున్నట్టుగా కూడా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ టాక్ వచ్చింది. కానీ ఆ త‌ర్వాత హ‌రిణ్య రెడ్డి అనే అమ్మాయితో సంద‌డి చేశాడు.

ఏదో ఒక విష‌యంతో తెగ వార్త‌ల‌లో నిలిచే రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ముంబైలో ఆటో న‌డిపి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన అత‌ను అక్క‌డ తెగ సంద‌డి చేశాడు. ఆటోని స్వ‌యంగా న‌డుపుతూ తెగ ర‌చ్చ చేశాడు. రాహుల్ ఆటో న‌డిపిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎంతగానో పాపులర్‌ అయిన నాటు నాటు సాంగ్‌ని రాహుల్‌ పాడిన సంగతి తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment