Radhe Shyam : రాధే శ్యామ్ కోసం వడ్డీలే రూ.60 కోట్లు చెల్లించారా..?

అక్టోబర్ 30, 2021 5:52 సా.

Radhe Shyam : చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రాధే శ్యామ్. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్‌లో కనిపించబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇది గొప్ప ప్రేమ‌క‌థ గా మెష‌న్ పోస్ట‌ర్ ద్వారా రివీల్ అయ్యింది. ఇందులో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ భవిష్యత్ ని చెప్పగలిగే విక్రమాదిత్యగా కనిపించనున్నారు.

Radhe Shyam only finance interests paid over rs 60 crores

వింటేజ్ బ్యాక్‌డ్రాప్ లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా “రాధే శ్యామ్” చిత్రాన్ని తెర‌కెక్కించారు. బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ పెర‌గ‌డంతో ఈ సినిమాపై భారీగా ఖ‌ర్చు పెట్టారు. ఈ సినిమా ఎప్పుడో రావ‌ల‌సి ఉన్నా క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే సినిమా కోసం దాదాపుగా రూ.300 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌గా, యూవీ సంస్థ కేవలం రాధేశ్యామ్ సినిమా ఫైనాన్స్ మీద రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర వడ్డీలనే చెల్లించినట్లు తెలుస్తోంది.

క‌రోనా వ‌ల్ల రెండేళ్ల పాటు చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌డంతో వ‌డ్డీల భారం పెరిగింది. మ‌రి రాధే శ్యామ్ విడుద‌ల అయ్యాక ఆ రేంజ్‌లో లాభాలు రాబ‌డతాడా అన్న‌ది చూడాలి. 1960ల సమయంలో ఐరోపాలో జరిగిన ఒక కథని ఆధారంగా తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ కొంత భాగాన్ని ఐరోపాలో షూట్ చేసినప్పటికీ, హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లలో ఎక్కువ భాగం షూటింగ్ జ‌రిగింది.

రాధే శ్యామ్’ను ఈ ఏడాది జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయ‌బోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment