Radhe Shyam : అభిమాని సూసైడ్ లెట‌ర్‌తో భ‌య‌ప‌డ్డ యూవీ క్రియేష‌న్స్.. అప్‌డేట్‌ ఇచ్చారు..

November 13, 2021 4:11 PM

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాహో త‌ర్వాత ఆయ‌న సినిమా విడుద‌ల కాక చాలా రోజులైంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే షూటింగ్ పూర్తైన రాధే శ్యామ్ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ మొదలై దాదాపు మూడేళ్లు అవుతోంది. అనేక కారణాలతో ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

Radhe Shyam makers released update about movie

ఈ మూవీకి అనుకున్న స్థాయిలో అప్‌డేట్స్‌ రావడం లేదు. చాలా కాలంగా ఈ విషయంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. రాధే శ్యామ్ నిర్మాతలుగా ఉన్న యూవీ క్రియేషన్స్ పై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ పై పలుమార్లు ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రీసెంట్‌గా ఓ అభిమాని యూవీ క్రియేషన్స్ తీరుతో విసిగిపోయి.. ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాశాడు. తన చావుకు యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కారణం అని లేఖలో పేర్కొన్నాడు.

నా చావుతో అయినా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ సూసైడ్ నోట్ లో తన మనోభావాలు వెల్లడించాడు. ఈ లెట‌ర్ త‌ర్వాత మేక‌ర్స్ వెంటనే అప్‌డేట్ ఇచ్చారు.

నవంబర్ 15న ఈ రాత‌లే అనే సాంగ్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ పాట‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించ‌నుంద‌ట‌. ‘రాధేశ్యామ్’ సినిమాకి హిందీ వర్షన్ లో మిథున్, మనన్ భరద్వాజ్ లు కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment