Pushpa 2 : బన్నీ అభిమానుల‌కు చేదు వార్త‌.. అస‌లు మింగుడు ప‌డ‌ని విష‌యం..!

June 28, 2022 7:58 AM

Pushpa 2 : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పుష్ప మొద‌టి పార్ట్ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. హిందీ అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. అయితే మొద‌టి పార్ట్ మూవీ రిలీజ్ అయి దాదాపుగా 7 నెల‌లు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ ఇంకా రెండో పార్ట్‌పై ఎటూ తేల్చ‌డం లేదు. ఏప్రిల్ నెల‌లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావ‌ల్సి ఉన్నా.. అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతోంది. ఈ మూవీ షూటింగ్‌ను ఆగ‌స్టు నుంచి ప్రారంభిద్దామని గ‌తంలో అనుకున్నారు. కానీ అక్టోబ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక మూవీ షూటింగ్ వాయిదా ప‌డడంతో రిలీజ్ తేదీల‌ను కూడా మార్చాల్సి వ‌స్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీని 2023 డిసెంబ‌ర్‌లో లేదా 2024 సంక్రాంతి వ‌ర‌కు రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అదే జ‌రిగితే ఇంకో ఏడాదిన్న‌ర వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇది బ‌న్నీ అభిమానుల‌కు మింగుడ ప‌డ‌ని చేదు వార్త‌గానే చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి ఏప్రిల్ నెల‌లో షూటింగ్ మొద‌లు పెట్టి త్వ‌ర‌గా పూర్తి చేసి డిసెంబ‌ర్ లేదా 2023 జ‌న‌వ‌రిలో మూవీని రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నారు. కానీ అది అస‌లు సాధ్య‌ప‌డ‌డం లేదు. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు పుష్ప 2 షూటింగ్ తేదీలు దూరం జ‌రుగుతూనే ఉన్నాయి. దీంతో బ‌న్నీ అభిమానులు ఇప్ప‌టికే అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక షూటింగ్ మళ్లీ వాయిదా ప‌డ‌డం అలాగే రిలీజ్ తేదీలు కూడా ఇప్ప‌ట్లో లేక‌పోవ‌డం.. వారికి తీవ్ర‌మైన అసంతృప్తిని తెప్పిస్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. దీనిపై అభిమానుల స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

Pushpa 2 further more delayed fans are not happy
Pushpa 2

ఇక ద‌ర్శ‌కుడు సుకుమార్ పుష్ప 2 క‌థ‌ను ఇంకా సిద్ధం చేయ‌లేద‌ని స‌మాచారం. హిందీ మార్కెట్ ల‌క్ష్యంగా ఆయ‌న క‌థ‌ను రూపొందిస్తున్నార‌ట‌. దీంతోపాటు న‌టీన‌టుల ఎంపిక కూడా జ‌రుగుతోంద‌ట‌. క‌నుక‌నే షూటింగ్ ఆల‌స్యం అవుతుంద‌ని స‌మాచారం. ఇక బ‌న్నీ ప్ర‌స్తుతం ఫ్యామిలీతో గ‌డుపుతుండ‌గా సుకుమార్ క‌థ‌ను సిద్ధం చేస్తూ మ‌రోవైపు న‌టీన‌టుల ఎంపికను చూసుకుంటున్నారు. పుష్ప మొద‌టి పార్ట్‌కు రూ.150 కోట్లు ఖ‌ర్చు కాగా రెండో పార్ట్‌ను రూ.400 కోట్ల‌తో తెరకెక్కించ‌నున్నార‌ని స‌మాచారం. మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment