Puneeth Rajkumar : కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో తనయుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం గుండెపోటుతో కన్నుమూశారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తోన్న సమయంలో ఆయనకు గుండెపోటు సంభవించినట్లు తెలిపారు. ఆయనను హుటాహుటిన విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం ఆయన కన్నుమూశారు.
పునీత్ రాజ్‌కుమార్‌కు జూనియర్ ఎన్టీఆర్‌తో సన్నిహిత సంబంధం ఉంది. ఇద్దరి మధ్య స్నేహబంధం ఉంది. పునీత్ రాజ్ కుమార్ నటించిన చక్రవ్యూహ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడారు. కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్. మొదటి కుమారుడు శివరాజ్ కుమార్ కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. నటసార్వభౌమ, చక్రవ్యూహ, రణవిక్రమ, దొడ్మనె హుడుగ, పవర్.. వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పునీత్ రాజ్‌కుమార్.
పునీత్ మృతితో శాండల్‌వుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కర్నాటక అంతా హై అలర్ట్ ప్రకటించారు. థియేటర్స్ అన్నీ మూసివేశారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హస్పిటల్ ప్రధాన మార్గాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కంఠీరవ స్టేడియానికి పునీత్ భౌతిక కాయం తరలించనున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…