Puneeth Rajkumar : శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఉండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక పునీత్ మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు స్పందిస్తూ అసలు పునీత్ గుండెపోటుతో మరణించలేదని వెల్లడించారు.
ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా చురుకుగా ఉండే పునీత్ శుక్రవారం ఉదయం చాలా చెమటలు పోస్తూ తన భార్య అశ్వినితో కలసి తనవద్దకు వచ్చారని అయితే అప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన వెల్లడించారు. ఎందుకైనా మంచిది ఒకసారి ఈసీజీ చేస్తే బాగుంటుందని ఈసీజీ పరీక్ష చేయించగా అందులో ఒక స్ట్రెయిన్ కనిపించిందని అందుకే అన్ని ప్రత్యేకతలు కలిగిన విక్రమ్ హాస్పిటల్ లో ఐసీయూ సిద్ధం చేయమని అక్కడికి పంపించినట్లు డాక్టర్ రమణారావు తెలిపారు.
ఆరోగ్యం పట్ల పునీత్ ఎంతో శ్రద్ధ తీసుకుంటారని, ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాలని చాలామందికి తాను సలహా ఇచ్చినట్లు తెలిపారు. పునీత్ విషయంలో ఇది ఒక హఠాత్ పరిణామం అని తెలిపిన ఆయన ఇది గుండెపోటు (గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం) కాదని.. కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం ఆకస్మాత్తుగా ఆగిపోవడం) అని వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…