Puneeth Rajkumar : పునీత్ గుండెపోటుతో మరణించ లేదు.. ఆయన మరణానికి అసలు కారణం ఇదే..!

October 31, 2021 12:37 PM

Puneeth Rajkumar : శుక్రవారం ఉదయం జిమ్ చేస్తూ ఉండగా తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక పునీత్ మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు స్పందిస్తూ అసలు పునీత్ గుండెపోటుతో మరణించలేదని వెల్లడించారు.

Puneeth Rajkumar death real reason told by doctor

ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా చురుకుగా ఉండే పునీత్ శుక్రవారం ఉదయం చాలా చెమటలు పోస్తూ తన భార్య అశ్వినితో కలసి తనవద్దకు వచ్చారని అయితే అప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన వెల్లడించారు. ఎందుకైనా మంచిది ఒకసారి ఈసీజీ చేస్తే బాగుంటుందని ఈసీజీ పరీక్ష చేయించగా అందులో ఒక స్ట్రెయిన్‌ కనిపించిందని అందుకే అన్ని ప్రత్యేకతలు కలిగిన విక్రమ్ హాస్పిటల్ లో ఐసీయూ సిద్ధం చేయమని అక్కడికి పంపించినట్లు డాక్టర్ రమణారావు తెలిపారు.

ఆరోగ్యం పట్ల పునీత్ ఎంతో శ్రద్ధ తీసుకుంటారని, ఆయనను చూసి ఎంతో నేర్చుకోవాలని చాలామందికి తాను సలహా ఇచ్చినట్లు తెలిపారు. పునీత్ విషయంలో ఇది ఒక హఠాత్‌ పరిణామం అని తెలిపిన ఆయన ఇది గుండెపోటు (గుండెకు రక్తప్రసరణ ఆగిపోవడం) కాదని.. కార్డియాక్ అరెస్ట్ (గుండె కొట్టుకోవడం ఆకస్మాత్తుగా ఆగిపోవడం) అని  వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now