గురువారం, జూన్ 11, 2026
వినోదం

Pulimada OTT Release Date : ఓటీటీ ప్రియుల‌ని అల‌రించేందుకు వ‌స్తున్న‌మ‌రో మ‌ళయాళ థ్రిల్ల‌ర్..!

Pulimada OTT Release Date : ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళం సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లు ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఏ మ‌ల‌యాళీ సినిమా వ‌చ్చిన కూడా వాటికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల ఓ…

Pulimada OTT Release Date : ఓటీటీ ప్రియుల‌ని అల‌రించేందుకు వ‌స్తున్న‌మ‌రో మ‌ళయాళ థ్రిల్ల‌ర్..!

Pulimada OTT Release Date : ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళం సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లు ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఏ మ‌ల‌యాళీ సినిమా వ‌చ్చిన కూడా వాటికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే ఇటీవ‌ల ఓ మ‌ల‌యాళీ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌లై మంచి విజ‌యం సాధిచింది. ఆ చిత్రం పులిమ‌డ‌. రాజేశ్ దామోదరన్ నిర్మించిన ఈ సినిమాకి, సజన్ దర్శకత్వం వహించాడు. ఇషాన్ దేవ్ బాణీలను సమకూర్చిన ఈ సినిమాకి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతాన్ని అందించాడు. చిత్రంలో జోజు జార్జ్ కథానాయకుడిగా నటించగా, అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించింది.

ఈ చిత్రం అక్టోబర్ 26వ తేదీన థియేటర్లలోకి రాగా, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఐదు భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ను జరుపుకునేందుకు సిద్ధ‌మైంది. గురువారం (నవంబర్ 23) నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరో మానసిక స్థితి సరిగ్గా లేని తన తల్లి ఆలనా పాలన చూస్తుంటాడు. కొన్ని కారణాల వలన అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోతుంది. ఊహించని ఆ సంఘటన హీరో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అప్పుడు అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Pulimada OTT Release Date know the streaming details
Pulimada OTT Release Date

పులిమడ మూవీలో నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ప్రేక్షకులని ఎంత‌గానో క‌ట్టిప‌డేసాయి. ముఖ్యంగా విన్సెంట్ స్కారియాగా జోజు జార్జ్ నటన సూప‌ర్భ్‌గా అనిపించింది. అతడు ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు. అటు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మాహిష్మతిగా నటించి ప్ర‌తి ఒక్కరిని అల‌రించింది. పులిమడలోని ఈ లీడ్ క్యారెక్టర్లు సినిమా అంతా ఎంతో ఆసక్తి రేపేలా ఉండ‌డంతో మూవీని చూసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.