సమంత, నాగచైతన్య గత నెల రోజుల కిందట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అయితే అంతకు కొన్ని రోజుల ముందే సమంత తన సోషల్ ఖాతాల్లో తన పేరు చివర ఉన్న అక్కినేని అనే పదాన్ని తొలగించి కేవలం ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచింది. దీంతో ఆమె, చైతన్య విడాకులు తీసుకుంటారు కాబోలు.. అని అందరూ అనుకున్నారు. అనుకున్న విధంగానే వారు విడాకులు తీసుకున్నారు.
ఇక తాజాగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తన పేరు చివర ఉన్న చోప్రా అనే పేరుతోపాటు భర్త చివరి పేరు జోనాస్‌ను తొలగించి కేవలం ప్రియాంక అనే పదాన్ని మాత్రమే తన సోషల్ ఖాతాల్లో ఉంచింది. దీంతో సమంత లాగే ప్రియాంక, నిక్ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారు కాబోలు.. అని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలను ప్రియాంక తారుమారు చేసింది. తన పేరు చివర చోప్రా జోనాస్ అనే పదాలను ఎందుకు తొలగించిందో స్పష్టతను ఇచ్చింది.
ఇటీవలి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమరాలజీని చాలా మంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక కూడా తన పేరు చివర ఉన్న చోప్రా, జోనాస్ అనే పదాలను తొలగిస్తే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం అంతా సెట్ అవుతుందని ఎవరో చెప్పారట. అందుకనే ఆ పదాలను తొలగించిందట. అంతేకానీ.. అందరూ అనుకున్నట్లు విడాకులు ఏమీ తీసుకోబోవడం లేదట. ఈ క్రమంలోనే తాను ఇకపై కేవలం ప్రియాంకగా కొనసాగనున్నట్లు చెప్పింది. అందుకనే సోషల్ ఖాతాల్లో ప్రియాంక అనే పదాన్ని మాత్రమే ఉంచానని చెప్పింది. ఇదీ అసలు విషయం.
ఇక ప్రియాంక, నిక్ జోనాస్ ఇద్దరూ త్వరలో పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక నటించి లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం.. మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే జీ లే జరా అనే బాలీవుడ్ మూవీలోనూ ఆమె త్వరలో నటించనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…