ప్రియాంక చోప్రా పేరు మార్పు వెనుక అస‌లు విష‌యం ఇదీ..!

November 24, 2021 6:56 PM

స‌మంత‌, నాగ‌చైత‌న్య గ‌త నెల రోజుల కింద‌ట విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అయితే అంత‌కు కొన్ని రోజుల ముందే స‌మంత త‌న సోష‌ల్ ఖాతాల్లో త‌న పేరు చివ‌ర ఉన్న అక్కినేని అనే ప‌దాన్ని తొల‌గించి కేవ‌లం ఎస్ అనే అక్ష‌రాన్ని మాత్ర‌మే ఉంచింది. దీంతో ఆమె, చైత‌న్య విడాకులు తీసుకుంటారు కాబోలు.. అని అంద‌రూ అనుకున్నారు. అనుకున్న విధంగానే వారు విడాకులు తీసుకున్నారు.

priyanka chopra name change this is the reason

ఇక తాజాగా గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా త‌న పేరు చివ‌ర ఉన్న చోప్రా అనే పేరుతోపాటు భ‌ర్త చివ‌రి పేరు జోనాస్‌ను తొల‌గించి కేవ‌లం ప్రియాంక అనే ప‌దాన్ని మాత్ర‌మే త‌న సోష‌ల్ ఖాతాల్లో ఉంచింది. దీంతో స‌మంత లాగే ప్రియాంక, నిక్ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారు కాబోలు.. అని అంద‌రూ అనుకున్నారు. అయితే అంద‌రి అంచ‌నాల‌ను ప్రియాంక తారుమారు చేసింది. త‌న పేరు చివ‌ర చోప్రా జోనాస్ అనే ప‌దాల‌ను ఎందుకు తొల‌గించిందో స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది.

ఇటీవ‌లి కాలంలో చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని, న్యూమ‌రాల‌జీని చాలా మంది న‌మ్ముతున్నారు. అందులో భాగంగానే ప్రియాంక కూడా త‌న పేరు చివ‌ర ఉన్న చోప్రా, జోనాస్ అనే ప‌దాల‌ను తొల‌గిస్తే న్యూమ‌రాల‌జీ, ఆస్ట్రాల‌జీ ప్ర‌కారం అంతా సెట్ అవుతుంద‌ని ఎవ‌రో చెప్పార‌ట‌. అందుక‌నే ఆ పదాల‌ను తొల‌గించింద‌ట‌. అంతేకానీ.. అంద‌రూ అనుకున్న‌ట్లు విడాకులు ఏమీ తీసుకోబోవ‌డం లేద‌ట‌. ఈ క్ర‌మంలోనే తాను ఇక‌పై కేవ‌లం ప్రియాంక‌గా కొన‌సాగ‌నున్న‌ట్లు చెప్పింది. అందుక‌నే సోష‌ల్ ఖాతాల్లో ప్రియాంక అనే ప‌దాన్ని మాత్ర‌మే ఉంచాన‌ని చెప్పింది. ఇదీ అస‌లు విష‌యం.

ఇక ప్రియాంక‌, నిక్ జోనాస్ ఇద్ద‌రూ త్వ‌ర‌లో పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రియాంక న‌టించి లేటెస్ట్ హాలీవుడ్ చిత్రం.. మ్యాట్రిక్స్ రిస‌రెక్ష‌న్స్ డిసెంబ‌ర్ 22వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే జీ లే జ‌రా అనే బాలీవుడ్ మూవీలోనూ ఆమె త్వ‌ర‌లో న‌టించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now