Priyamani : ఏమవుతుందో తెలియదు కానీ ఈ మధ్య సినీ పరిశ్రమలో సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుని దూరమవుతున్నారు. యంగ్ కపుల్స్ నుంచి సీనియర్ హీరోలతో సహా విడాకుల వార్తలను ప్రకటిస్తూ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నారు. గత ఏడాది మోస్ట్ లవ్ కపుల్ సమంత, నాగ చైతన్య, ఆ తర్వాత ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో అందాల తార ప్రియమణి కూడా చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున, ఎన్టీఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్ వంటి అగ్రస్థాయి హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రియమణి.
ఇక సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ముస్తఫా అనే అతనిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ముస్తఫాకు ముందుగానే వివాహమైంది. కానీ ప్రియమణి, అతను ప్రేమించి పెళ్లి చేసుకొని అత్త వారింటికి రెండో భార్యగా అడుగుపెట్టింది. ముస్తఫా మొదటి భార్య ప్రియమణిపై కేస్ పెడతానని బెదిరించినా ఎక్కడా భయపడకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్లి పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిత్రాలలో అడుగుపెట్టి మంచి మంచి ఆఫర్లను చేజిక్కించుకుంది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.
అయితే ఇప్పుడు ప్రియమణి గురించి సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో భర్తతో వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట పెళ్లి చేసుకొని చాలా కాలం అయినా పిల్లలు లేరు. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని ప్రియమణి కూడా అనుకుంటుందట. కెరీర్ లో స్థిరపడిన తరువాత ప్లాన్ చేసుకుందాం అంటూ ఎప్పటికప్పుడు పిల్లలను కనడానికి అవాయిడ్ చేస్తున్నారట. ఈ కారణంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులకు దారి తీశాయి అంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ప్రియమణి ఇప్పటివరకు స్పందించలేదు. అసలు విషయం ఏంటనేది ప్రియమణి చెప్పే జవాబుపై ఆధారపడి ఉంటుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…