Priyamani : భ‌ర్త‌తో విభేదాలు..? విడాకులు తీసుకోనున్న ప్రియ‌మ‌ణి..?

August 16, 2022 12:40 PM

Priyamani : ఏమవుతుందో తెలియదు కానీ ఈ మధ్య సినీ పరిశ్రమలో సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకుని దూరమవుతున్నారు. యంగ్ కపుల్స్ నుంచి సీనియర్ హీరోల‌తో సహా విడాకుల‌ వార్తల‌ను ప్రకటిస్తూ అభిమానులను షాక్ కు గురి చేస్తున్నారు. గత ఏడాది మోస్ట్ లవ్ కపుల్ సమంత, నాగ చైతన్య, ఆ తర్వాత ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో అందాల తార ప్రియమణి కూడా చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగార్జున, ఎన్టీఆర్, గోపీచంద్, కళ్యాణ్ రామ్ వంటి అగ్రస్థాయి హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రియమణి.

ఇక సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో ముస్తఫా అనే అతనిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ముస్తఫాకు ముందుగానే వివాహమైంది. కానీ ప్రియమణి, అతను ప్రేమించి పెళ్లి చేసుకొని అత్త వారింటికి రెండో భార్యగా అడుగుపెట్టింది. ముస్తఫా మొదటి భార్య ప్రియమణిపై కేస్ పెడతానని బెదిరించినా ఎక్కడా భయపడకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్లి పోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చిత్రాలలో అడుగుపెట్టి మంచి మంచి ఆఫర్లను చేజిక్కించుకుంది ప్రియమణి. ప్రస్తుతం ప్రియమణి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.

Priyamani reportedly taking divorce
Priyamani

అయితే ఇప్పుడు ప్రియమణి గురించి సోషల్ మీడియాలో ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో భర్తతో వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జంట పెళ్లి చేసుకొని చాలా కాలం అయినా పిల్లలు లేరు. ఇప్పుడప్పుడే పిల్లలు వద్దని ప్రియ‌మణి కూడా అనుకుంటుంద‌ట. కెరీర్ లో స్థిరపడిన తరువాత ప్లాన్ చేసుకుందాం అంటూ ఎప్పటికప్పుడు పిల్లల‌ను కనడానికి అవాయిడ్ చేస్తున్నారట. ఈ కారణంగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడాకులకు దారి తీశాయి అంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయంపై ప్రియమణి ఇప్పటివరకు స్పందించలేదు. అసలు విషయం ఏంటనేది ప్రియమణి చెప్పే జవాబుపై ఆధారపడి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now