Priyamani : సినిమా ఇండ‌స్ట్రీలో పేరు రావాలంటే.. హీరోయిన్లు అలా ఉండాల్సిందే : ప్రియ‌మ‌ణి

April 7, 2022 7:52 PM

Priyamani : ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలంద‌రితోనూ క‌లిసి ప‌ని చేసిన అందాల ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి పెళ్లి త‌ర్వాత కాస్త గ్యాప్ ఇచ్చింది. దశాబ్దం గ్యాప్ తరువాత మళ్లీ సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీ అయిపోయింది. రెండేళ్ల క్రితం విడుదలయిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తనను మరోసారి హిందీ ప్రేక్షకులకు దగ్గర చేసింది. హిందీలోనే కాదు సౌత్‌లో కూడా ప్రియమణి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ.. మొదలైన‌ తెలుగు చిత్రాలలో నటించింది.

Priyamani said heroines should be like that
Priyamani

తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మళ‌యాళీ, తమిళ‌ భాషల్లో నటించింది. ఇక 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలకి కాస్త‌ బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. గతేడాది నారప్పతో సూపర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ తాజాగా భామాకలాపం అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇందులో ప్రియమణి నటనపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో ప్రియమణి రెమ్యునరేషన్ పెంచేసిందన్న టాక్ ఫిలిం నగర్ లో జోరుగా నడుస్తోంది.

సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉండే ప్రియ‌మ‌ణి ఒక్కోసారి పొట్టి దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. అయితే ఒక్కోసారి త‌న డ్రెసింగ్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. వీటిపై త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది ప్రియ‌మ‌ణి. తాజాగా సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తోపాటు, మంచి అందం, స్కిన్ టోన్, ఆకట్టుకునే దుస్తులు, మంచి హెయిర్ స్టైల్ కలిగి ఉండాలని పేర్కొంది. సెల‌బ్రిటీ బ‌య‌ట‌కు వ‌చ్చారంటే వారిని తమ కెమెరాల‌లో బంధిస్తూ ఉంటారు. హీరోయిన్స్ ధ‌రించే బ‌ట్ట‌ల‌పై త‌ప్పుడు కామెంట్స్ కాస్త త‌గ్గించుకుంటే మంచిది. ఆ దుస్తులు కేవలం షోలో అరగంట మాత్రమే ధరిస్తుంటారని.. ప్రజలు దీన్ని తెలుసుకోవాలని తెలిపింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment