Priyamani : ఆ నిర్మాతకి నో చెప్పినా.. ఆ రకంగా చాలా ఇబ్బంది పెట్టాడు..

September 21, 2022 2:38 PM

Priyamani : వల్లభ హీరోగా ఎవరే అతగాడు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ ఆ తర్వాత ప్రియమణి.. జగపతి బాబు సరసన నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రం హిట్ అవ్వడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యమదొంగ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ప్రియమణికి స్టార్ స్టేటస్ ఏర్పడింది. తరువాత నవ వసంతం, ద్రోణ, శంభో శివ శంభో, గోలీమార్, రగడ వంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

అదే టైంలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల విరాట పర్వంలో కూడా నటించింది. అలాగే ప్రియమణి బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి మెప్పించింది. ఆమె చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. ఈ సిరీస్ తో బాలీవుడ్ లో కూడా ప్రియమణికి మంచి గుర్తింపు లభించింది. మరోవైపు ప్రియమణి బుల్లితెర షోల ద్వారా తన అందచందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఢీ డాన్సు ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే ఇంత క్రేజ్, హోదా ఉన్న ప్రియమణికి సైతం ఇబ్బందులు తప్పలేదట.

Priyamani told about a film and a producer
Priyamani

హీరోయిన్ గా చేసిన తొలినాళ్లలో ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆమెను బాగా ఇబ్బంది పెట్టాడట. ఓ సినిమా సగం షూటింగ్ అయిన తర్వాత.. ఓ సీన్ కోసం ప్రియమణి బొడ్డు దగ్గర టాటూ వేయించుకోవాలని నిర్మాత బాగా ఇబ్బంది పెట్టాడట. అప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తన వల్ల సినిమా డిస్టర్బ్ అవ్వడం ఎందుకని, చేసేదేమీ లేక ఇష్టం లేకపోయినా నిర్మాత కండిషన్ కి ఒప్పుకుని బొడ్డు మీద టాటూ వేయించుకుందట. ప్రియమణి కూడా ఇలానే నచ్చకపోయినా బలవంతంగా ఆ పని చేయాల్సి వచ్చిందట. ఇది ఎంత వరకు నిజమో కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment