గురువారం, జూన్ 11, 2026
ఆరోగ్యం

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను తీసుకుంటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా.. ఎవ‌రూ చెప్ప‌లేదే..!

Poppy Seeds : చాలా వంటల్లో మనం గసగసాలని వాడుతూ ఉంటాము. గసగసాల వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి, గసగసాల వలన కలిగే లాభాలు తెలియదు. మనం ఉపయోగించే మసాలా దినుసులులో గసగసాలు కూడా ఒకటి.…

Poppy Seeds : గ‌స‌గ‌సాల‌ను తీసుకుంటే ఇన్ని లాభాలు క‌లుగుతాయా.. ఎవ‌రూ చెప్ప‌లేదే..!

Poppy Seeds : చాలా వంటల్లో మనం గసగసాలని వాడుతూ ఉంటాము. గసగసాల వలన, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా మందికి, గసగసాల వలన కలిగే లాభాలు తెలియదు. మనం ఉపయోగించే మసాలా దినుసులులో గసగసాలు కూడా ఒకటి. వీటినే గసాలు అని కూడా అంటారు. గసగసాల నుండి, నల్లమందుని తయారు చేయడం జరుగుతుంది. నల్లమందు ఆరోగ్యానికి హానికరం. గసగసాలని కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి కూడా, గసగసాలని ఔషధాల్లో వాడడం జరుగుతుంది.

గసగసాలని వంటల్లో వేస్తే, వంటకి కమ్మని రుచి వస్తుంది. గసగసాల వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. గసగసాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటివి గసగసాలు లో ఎక్కువగా ఉంటాయి. గసగసాలలో లేనోలినిక్ ఆసిడ్ ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండె కి కావాల్సిన ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ గసగసాలలో ఉంటుంది.

Poppy Seeds health benefits in telugu
Poppy Seeds

చిన్నగా ఉండే ఈ గసగసాలను తీసుకుంటే, ఎన్నో రకాల లాభాలని పొందడానికి అవుతుంది. గసగసాలని తీసుకోవడం వలన, నిద్రలేమి సమస్య నుండి కూడా బయటపడొచ్చు. చాలామంది, నిద్రలేమీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు, గసగసాలు అని తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. గసగసాలని పేస్ట్ కింద చేసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో వేసుకొని, ఈ గసగసాల పాలను తీసుకుంటే చక్కటి నిద్ర పొందవచ్చు.

నిద్రలేమి సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు. అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది. పేగు కదలికలని నిర్వహించడానికి, మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా కూడా చూస్తుంది. అలానే, గుండె సమస్యలు ఉన్నవాళ్లు గసగసాలు తీసుకుంటే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.