Pooja Hegde : ఎట్ట‌కేల‌కు తన లవ్ సీక్రెట్స్ గురించి చెప్పిన బుట్టబొమ్మ..!

October 19, 2021 6:36 PM

Pooja Hegde : తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఒక లైలా కోసం అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ప్రస్తుతం వరుస సినిమాలతో నంబర్ వన్ హీరోయిన్ గా మారింది. టాప్ హీరోలకు జోడీగా నటిస్తూ తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. లేటెస్ట్ గా అఖిల్ అక్కినేనితో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో వినూత్నమైన పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రజంట్ ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీస్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకుంది. యంగ్ హీరోలకు దీటుగా నటిస్తూ క్రేజ్ ని మరింతగా పెంచుకుంటోంది.

Pooja Hegde told about her love secrets

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విశేషాల్ని షేర్ చేసుకుంది. పూజా హెగ్డె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్ళు అవుతోంది. అయితే తాను ఇంకా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానని అంది. కెరీర్ లో తాను భారీ విజయాలు అందుకున్నా కొంతకాలం గ్యాప్ వచ్చిందని అంది. అలాగే జైపూర్ మహారాణి గాయత్రి దేవి జీవిత కథలో నటించాలని ఉందని తన లైఫ్ డ్రీమ్ చెప్పుకొచ్చింది.

ఇక పూజా హెగ్డెకి ఎంతమంది ప్రపోజ్ చేశారని అడిగితే.. తనకు అసలు ఇప్పటి వరకు ఒక్కరు కూడా లవ్ లెటర్ ఇవ్వలేదని షాక్ ఇచ్చింది. కాలేజ్ డేస్ లో తనకు చాలా సిగ్గని.. ఇప్పుడేమో సినిమాలతో ఫుల్ బిజీ అంటూ.. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు కనుక ఇంకేం చెప్పలేనని అంది. అలా ఆమె లైఫ్ లో అసలు లవ్ అనే పదానికి ఇంతవరకు ప్లేస్ లేదని అంది. పూజా హెగ్డె ప్రజంట్ ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ లాంటి సినిమాలతోపాటు బాలీవుడ్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment