Pooja Hegde : స‌రికొత్త రికార్డ్ ను క్రియేట్‌ చేసిన పూజా హెగ్డె.. బుట్ట‌బొమ్మ మామూల్ది కాదు..!

April 19, 2022 9:00 PM

Pooja Hegde : పూజా హెగ్డె ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో కుర్ర‌హీరోల‌తో క‌లిసి సినిమాలు చేసేది. అర‌వింద స‌మేత త‌ర్వాత ఈ అమ్మ‌డి ఫేట్ మారింది. బడా హీరోల స‌ర‌స‌న ఛాన్స్ లు ద‌క్కించుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో సత్తా చాటుతోన్నప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.

Pooja Hegde sets new record in Tollywood
Pooja Hegde

అరవింద సమేత.. వీరరాఘవతో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది. ఇటీవలే ఆమె రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది డిజాస్టర్‌గా మిగలడంతో పూజాకు భారీ షాక్ తగిలింది. అలాగే విజయ్‌తో కలిసి చేసిన బీస్ట్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.

రెండు ఫ్లాపులు వ‌చ్చినా పూజా క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ అమ్మ‌డు ఒక సినిమా కోసం దాదాపు రూ.2.75 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు అందుకుంటోంది. ఇక రంగ‌స్థ‌లంలో స్పెష‌ల్ సాంగ్ చేసిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలోనూ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ ఇప్ప‌టికే పూర్తయింది. ఈ పాట కోసం పూజ ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఒక్క పాట కోసమే ఇంత పెద్ద మొత్తంలో ఏ నటి అందుకోలేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా.. పాటకు సమంత రూ.1.50 కోట్ల‌ పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె ఆ రికార్డ్‌ని బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో పూజా హెగ్డె కొత్త రికార్డును సృష్టించిన‌ట్లు అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment