Pooja Hegde : పూజా హెగ్డేకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలంగాణ ఎంపీ..!

November 26, 2021 11:10 PM

Pooja Hegde : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో నందితా శ్వేత, బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో తాజాగా పూజా హెగ్డే పాల్గొంది.

Pooja Hegde participated in green india challenge

టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించిన పూజాహెగ్డే రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కను నాటింది. అనంతరం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్‌ కి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” విసిరినట్లు తెలిపారు. అయితే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న పూజా హెగ్డేకు సంతోష్ కుమార్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను.. అని జోగినపల్లి సంతోష్‌ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్‌ చిత్రంలో నటిస్తోంది. అందులో ‘ప్రేరణ’ అనే పాత్రలో అభిమానులను అలరించనుంది. ఇక ఆచార్య‌, బీస్ట్ అనే చిత్రాల‌తోపాటు ప‌లు హిందీ చిత్రాల‌లోనూ పూజా న‌టిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment